Varalakshmi Sharath Kumar : ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్రలో లేడీ విలన్ గా వరలక్ష్మి నటన ఎవరైనా మర్చిపోగలారా? అంతవరకూ శరత్ కుమార్ కూతురు, తమిళ హీరో విశాల్ గర్ల్ ఫ్రెండ్ ఇలానే కొంచెం సినిమాలమీద అవగాహన ఉన్న తెలుగు ప్రేక్షకుడికి వరలక్ష్మి గురించి తెలుసు. కానీ ఒక్కసారిగా క్రాక్ సినిమాతో అమ్మడి నటన అందరినీ అబ్బురుపరిచింది. ఇక తెనాలి రామకృష్ణ, నాంది వంటి చిత్రాలతో అలరించినా క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ వేరు. హీరోయిన్ గా ‘తినద్రి’ పేరుతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అదృష్టం కలిసి రాలేదు.
తల్లిగా నటించబోతున్న వరలక్ష్మి…
హీరోయిన్ గా అమ్మడి ఆహార్యం సెట్ కాలేదు దీంతో ఎంత స్టార్ నటుడి కూతురు అయినా చూసే వాళ్ళు లేకపోతే ఏం చేస్తుంది ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది, విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అభిమానులు మాత్రం వరలక్ష్మి మాత్రం విలన్ గా సూపర్ అంటూ ఫిక్స్ అయ్యారు. అలా అమ్మడు ప్రస్తుతం నెగెటివ్ రోల్స్ లో అలరిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాలో ఒక కీలక పాత్రలో అలాగే ఎన్టీఆర్ కొరటాల సినిమాలో ఒక కీలకం పాత్రలో నటిస్తూ కెరీర్ మంచి ఊపు మీద ఉన్న వరలక్ష్మి ఇప్పుడు ‘శబరి’ అనే సినిమాలో తల్లి పాత్రలో కనిపించునుంది.
ఏమంత వయసయిందని తల్లి పాత్ర లో నటిస్తున్నావ్ అంటూ అభిమానులు అడుగుతున్నారు. కానీ వరలక్ష్మి మాత్రం శబరి సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అనిల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కూతురిని రక్షించుకోవడం కోసం పోరాడే అమ్మ పాత్రలో వరలక్ష్మి కనిపించునుంది. మరి ఈ పాత్ర వరలక్ష్మి కకెరీర్ కి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. అయితే అభిమానులు మాత్రం సినిమా హిట్ అయినా నీ కెరీర్ కి అది మైనస్ అంటూ ఫీల్ అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…