రోగనిరోధక శక్తిని పెంచే సీమ చింతకాయలు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలోదలరు..?

సీమ చింతకాయలు ఈ పేరు పల్లెటూరి లో ఉన్నవారికి బాగా సుపరిచితమే. సిటీ లో ఉన్న వారికి ఈ పేరు గురించి ఈ కాయల గురించి చాలా మందికి తెలియదు. వీటిని సీమచింతకాయ లని, గుబ్బ కాయలని, తొలి చింతకాయలనీ ఇలా ఒక్కొక్క ప్రదేశంలో ఒక విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ కాయలు మనకు వేసవి కాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ కాయ పచ్చగా ఉన్నప్పుడు వగరు గాను, పాకానికి వచ్చాక తియ్యగా ఉంటాయి.

ఈ సీమ చింతకాయలు పాకానికి వచ్చినప్పుడు గులాబీ రంగులోకి మారడం, లోపల పల్చటి గుజ్జు దానిని పోలిస్తే నల్లటి గింజలు ఉంటాయి. ఇందులో కొన్ని చెట్లు వగరు గాను కొన్ని చెట్లు తియ్యగా ఉంటాయి.అయితే ఈ కాయలను చెట్టు ఎత్తుకోవడానికి కాదు. ఎందుకంటే ఈ చెట్టు ప్రధాన కాండం వదులుకొని అంతా కూడా ముళ్ళతో ఉంటుంది. వీటిని ఏదైనా దోటి సహాయంతో కోయాలి.

ఈ సీమ చింతకాయ లో క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, నియాసిన్,విటమిన్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సీమచింతకాయ గొంతు చిగుళ్ళు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు.

క్షయ వ్యాధి నివారణకు చెట్టు వేర్లు బాగా ఉపయోగపడతాయి. చింతకాయలలో ఎక్కువగా పీచు పదార్థాలు, తక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ చింతకాయల లో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది. అలాగే ఈ సీమచింతకాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వృద్యాప్య ఛాయలను అరికడతాయి. గర్భిణీ స్త్రీలకు సీమచింతకాయ మంచి పోషకాలను ఇస్తుంది,నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.