Varun Tej -Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా గని, ఎఫ్ 3 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో గని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కాగా ఎఫ్3 సినిమాతో ఈయన ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా మంచి విజయం కావడంతో తన తండ్రి నాగబాబు నిర్మాణంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా గురించి అప్డేట్ విడుదల చేయాల్సి ఉంది.
ఇకపోతే హీరో వరుణ్ తేజ్ గురించి గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈయన నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.ఈయన లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉండటం వల్లే తన సోదరీ నిహారిక వివాహానికి ఏ ఇతర హీరోయిన్లు హాజరు కాకపోయినా లావణ్య త్రిపాటి మాత్రమే హాజరయిందంటూ వార్తలు షికార్లు చేశాయి.
ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి పెద్ద ఎత్తున ఈ వార్తలు రావడంతో ఇందులో నిజం లేదని లావణ్య త్రిపాఠి ఈ వార్తలను కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఒకచోట చేరి మరోసారి పెద్ద ఎత్తున సందడి చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు.అయితే తన ఫ్రెండ్ పుట్టినరోజు కావడంతో వీరిద్దరూ కూడా ఆ పుట్టిన రోజు వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ఒకే చోట చేరి కనిపించడంతో మరోసారి వీరి ప్రేమ గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి వీరిద్దరూ ఎక్కడ కలిసిన వీరి ప్రేమ గురించి వార్తలు రావడంతో చాలామంది వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని బయటకు చెప్పడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ ఉందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…