Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు.
ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నటువంటి ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది నవంబరు ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ గత ఏడాది జూన్ 20వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నారు. నిశ్చితార్థం తర్వాత తన కుటుంబ సభ్యులు రెండుసార్లు పెళ్లికి ముహూర్తం పెట్టినప్పటికీ వరుణ్ తేజ్ పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్..
ఈ విధంగా వీరిద్దరూ పెళ్లిని వాయిదా వేసుకోవడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.ఆపరేషన్ వాలంటైన్ సినిమా షూటింగ్ మధ్యలో పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించారట అయితే పెళ్లి పనులలో బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని అంతేకాకుండా తాను పూర్తిగా డిస్టర్బ్ అవుతాను అన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్ రెండుసార్లు పెళ్లిని వాయిదా వేసుకుని సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నవంబర్లోనే పెళ్లి చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ డెడికేషన్ అంటే ఇదే కదా అంటూ వరుణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…