Featured

Venkatesh : ఆ సినిమాలో భానుప్రియ కాళ్లు పట్టుకోవడం పట్ల ఆ రోజుల్లో చాలా విమర్శలు వచ్చాయి. : వెంకటేష్

Venkatesh : సినీ పరిశ్రమలో ఓ సినిమా పేరు చెప్పగానే.. దాని దర్శకుడు ఎవరో దాదాపుగా చెప్పేయవచ్చు. ఆ రోజుల్లో కమర్షియల్ చిత్రాలకు పెద్దపీట వేస్తున్న తెలుగు ప్రేక్షకులు.మంచి కథతో వస్తే కళాత్మక చిత్రాలు కూడా ఆదరిస్తారని నిరూపించారు. కళాత్మక చిత్రాలంటే కళాతపస్వి కె.విశ్వనాథ్ పేరే గుర్తుకు వస్తుంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వాతిముత్యం, ఈ సినిమా పేర్లు చెప్పగానే ఎవరైనా టక్కున చెప్పేపేరు కె.విశ్వనాథ్.

ఆయన తీసిన కళాత్మక చిత్రాలు ఖండాంతరాలకు వ్యాపించి అనేకమంది ప్రేక్షకాభిమానులను ఆయన సంపాదించుకోగలిగారు. ఆ సినిమాల తర్వాత వెంకటేష్ కె. విశ్వనాథ్ కాంబినేషన్లో ఒక చిత్రం వచ్చింది.
స్వర్ణకమలం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. వెంకటేష్, భానుప్రియ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను కె.ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.వి. అప్పారావు నిర్మించాడు. ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రాహకుడిగా, జి.జి. కృష్ణారావు ఎడిటరుగా పనిచేశారు. ఈ చిత్రానికి దర్శకుడు కె. విశ్వనాథ్ కథ,స్క్రీన్ ప్లే అందించాడు. తోటపల్లి సాయినాథ్ మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలకు ఇళయరాజా అందించిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది.

ఈ సినిమాలో కీలక భాగం కథానాయిక చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను భానుప్రియ పోషించగా, ఆమెకు స్ఫూర్తి కలిగించే పాత్రలో కథానాయకుడి పాత్రలో వెంకటేష్ నటించాడు. ఈ సినిమాలో కథానాయికకు స్ఫూర్తిని కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవెన్ తన నిజ జీవిత పాత్రలో నటించింది. మొదట్లో ఈ పాత్రకు యామిని కృష్ణమూర్తి, సంయుక్త పాణిగ్రాహి మొదలైన వారిని అనుకున్నారు. ఈమె ఒడిస్సీ గురువు కేలూచరణ్ మొహాపాత్రా శిష్యురాలు. ఒకసారి షారన్ దూరదర్శన్ కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమెను చూసిన చిత్రబృందం ఆ పాత్ర ఈమెకు సరిపోతుందని భావించారు. ఆమెకు తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా మళ్ళీ నటించలేదు. ఈమె స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి. కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్నసత్యంతో ఒక నెలరోజుల పాటు ఆ నృత్యం నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారు. కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చుననీ, ఇంకా ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానించడం తనకు ఇష్టం లేదని తెలిపింది.

దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్యాన్నే సినిమాలో ఉంచడానికి అంగీకరించాడు. ఈ చిత్రం కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్యకళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు. విక్టరీ వెంకటేష్ స్వర్ణకమలం సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతూ.. “కొత్తగా రెక్కలొచ్చిన గూటిలోని గువ్వ పిల్లకి.. అనే పాటకు ముందు భానుప్రియ సముద్రపు ఒడ్డున కూర్చుంటే సముద్రం నీరుతో గజ్జెలు కడిగి భానుప్రియ కాళ్లకు కట్టడం జరుగుతుంది.. ఆ సన్నివేశం నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశానని, కానీ సినిమా విడుదల అనంతరం అలా భానుప్రియ కాలు పట్టుకోవడం ఏంటని శ్రేయోభిలాషులు, అభిమానులు నన్ను అడిగారని.. క్యారెక్టర్ డిమాండ్ మేరకే చేయడం జరిగిందని చెప్పారు. స్వర్ణకమలం చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అలాగే తనకు ఉత్తమ జ్యూరీ పురస్కారం లభించిడం సినిమా షూటింగ్ లో పడిన కష్టాలన్నీంటిని మైమరిపించాయని వెంకటేశ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago