Featured

Flash Back : ఆ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ ముగ్గురిలో ఒక హీరో ముందుకు దూసుకు వెళ్లారు.!!

Flash Back : 1996 సంక్రాంతి బరిలో బాలయ్య, వెంకటేష్, శ్రీకాంత్ బాక్సాఫీస్ వద్ద తమ చిత్రాలతో ముందుకు దూసుకు వచ్చారు. టాప్ హీరో, మాతో పెట్టుకోకు లాంటి చిత్రాల పరాజయంతో ఉన్న బాలయ్యకు ఈ సినిమా మంచి ఉపశమనాన్ని ఇచ్చింది.

“వంశానికొక్కడు” 1996 లో శరత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, ఆమని, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను అలరించాయి.

ఈ సంవత్సరం విక్టరీ వెంకటేష్ విజయాలతో మంచి స్వింగ్ లో ఉన్నారు. “ధర్మచక్రం” 1996 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ కు నంది అవార్డ్ వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. అప్పటి దాకా కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా.

1995 జూన్ 22 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభించింది. రెండున్నర పాటలు కెనడాలో చిత్రీకరించారు. కెనడాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇది. మొత్తం 62 రోజులపాటు చిత్రీకరణ జరగగా వెంకటేష్ 52 రోజులు నటించాడు. ఈ సినిమా లోని నటనకు గాను వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా నంది బహుమతి వచ్చింది.

సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన “తాజ్ మహల్” చిత్ర విజయంతో దూసుకెళుతున్న శ్రీకాంత్ కు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. “పెళ్ళిసందడి”1996 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన కుటుంబ, ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వనీదత్, అల్లు అరవింద్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.

కథలోకి వెళితే..
విజయ్ ది (శ్రీకాంత్) సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి, ముగ్గురు అక్కలు, బావలతో కలిసి నివసిస్తుంటాడు. పెళ్ళివయసు రావడంతో తండ్రి అతన్ని తొందరగా పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తుంటాడు. ఆ పనిని తన ముగ్గురు అల్లుళ్ళకు అప్పజెబుతాడు. విజయ్ మాత్రం తనకు కలలో కనిపించిన స్వప్న సుందరిని మాత్రమే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అతని బావలు పోలికలు చెప్పమని అడిగితే బొడ్డు పక్కన ఉన్న పుట్టుమచ్చ ఉందని మాత్రమే చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ అంశం.. బాలయ్య నటించిన వంశానికొక్కడు, వెంకటేష్ నటించిన ధర్మచక్రం చిత్రాలు ఆ సంవత్సరం విజయవంతం అవగా.. శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago