Venu Swamy: టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి… ఆ హీరోకి తిరుగులేదు!
Venu Swamy: తెలుగు ప్రజలు ప్లవనామ సంవత్సరానికి స్వస్తిపలికి, శుభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే కొత్త ఏడాది మన జాతకం ఎలా ఉండబోతోందనే విషయం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల జాతకం ఈ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆతృత ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గతంలో నాగచైతన్య సమంత విడిపోతారనీ ఇతను చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా వేణు స్వామి ప్రభాస్ జాతకం చెబుతూ ప్రభాస్ తో సినిమా చేసే నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని, తన సినీ కెరీర్ ముగిసిపోయిందని వెల్లడించారు.
తాజాగా వేణు స్వామి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు హీరోలు, హీరోయిన్ల జాతకం గురించి కామెంట్లు చేశారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆ హీరోకి ఇండస్ట్రీలో తిరుగులేదని ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన విజయాలను అందుకుంటారని తెలిపారు.ఈయన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతాయని ఇండస్ట్రీకి ఈయన ఒక బంగారు బాతు అంటూ తెలిపారు.
ఇక అక్కినేని యువ హీరో అఖిల్ గురించి మాట్లాడుతూ అతనికి నాగ దోషం ఉందని తెలిపారు. ఇక హీరోయిన్ల ప్రస్తావన తీసుకు వస్తూ 2024 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు హీరోయిన్లు మంచి విజయాలతో దూసుకుపోతారని వెల్లడించారు. ఆ ముగ్గురు ఎవరు అనే విషయానికి వస్తే పూజా హెగ్డే, రష్మిక, సమంతలకు 2024 వరకు ఇండస్ట్రీలో తిరుగులేదని వేణుస్వామి వెల్లడించారు. ప్రస్తుతం వీరి గురించి వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం ప్రస్తుతం వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…