Featured

Will Smith: ఒక చెంప దెబ్బతో చిక్కుల్లో పడిన విల్ స్మిత్.. తన సినీ కెరీర్ ముగిసినట్టేనా?

Will Smith: ఆస్కార్ అవార్డు 2022 ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మరొక నటుడు క్రిస్ రాక్ పై చేయి చేసుకున్న ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా క్రిస్ రాక్ విల్ స్మిత్ అనారోగ్యంపై హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో విల్ స్మిత్ తనపై చేయి చేసుకున్నారు.

Will Smith: ఒక చెంప దెబ్బతో చిక్కుల్లో పడిన విల్ స్మిత్.. తన సినీ కెరీర్ ముగిసినట్టేనా?

ఇలా అందరి ముందు విల్ స్మిత్ తనపై చేయి చేసుకోవడంతో ఈ విషయం హాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఆవేశంలో తాను చేసిన తప్పుకు విల్ స్మిత్ బహిరంగంగా క్రిస్ రాక్ కి క్షమాపణలు చెప్పారు. ఈ విధంగా విల్ స్మిత్ క్షమాపణలు చెప్పినప్పటికీ AMPAS మాత్రం అక్కడితో వదిలేయలేదు.

Will Smith: ఒక చెంప దెబ్బతో చిక్కుల్లో పడిన విల్ స్మిత్.. తన సినీ కెరీర్ ముగిసినట్టేనా?

 AMPAS అధ్యక్షుడు ఈ విషయమై అస్కార్స్ డిసిప్లినరీ కమిటీకి లేఖ రాయడంతో విల్ స్మిత్ చిక్కుల్లో పడ్డారు. ఈ విధంగా విల్ స్మిత్ క్రిస్ రాక్ పై చేయి చేసుకోవడంతో ఆయన హాలీవుడ్ ఫిల్మ్ అకాడమీకి రాజీనామా చేశారు.ఈ విధంగా ఇతను రాజీనామా చేయడమే కాకుండా తన సినీ కెరీర్ పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి.

బయట పడటం కష్టమేనా…

విల్‌ హీరోగా ‘ఫాస్ట్‌ అండ్‌ లూజ్‌’ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలును ఉన్నఫలంగా హోల్డ్ లో పెట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ ను వదులుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా ఒక్క చెంపదెబ్బ కారణంగా విల్ స్మిత్ పూర్తిగా సినీ కెరియర్ ని కూడా కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago