Dasari Narayana Rao: చిరు, బాలయ్య, రాజశేఖర్ లకు అలాంటి ట్యాగ్స్ ఇచ్చిన దాసరి.. అవి ఏంటంటే?
Dasari Narayana Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా నిర్మాతగా నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సినీ పెద్దగా చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సేవలను అందించారు.
ఇప్పటివరకు చలన చిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడు సృష్టించని రికార్డులను దాసరి తన సొంతం చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి 15 చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకొని రికార్డును సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ దర్శకుడు కూడా చేదించకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే దాసరి దర్శకత్వంలో 1992లో సూరిగాడు అనే అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విజయవంతమైన తర్వాత దాసరి నారాయణరావు అప్పట్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ,రాజశేఖర్, మోహన్ బాబు గురించి మాట్లాడుతూ వారికంటూ ఒక ప్రత్యేకమైన ట్యాగ్స్ ఇచ్చారు. మరి దాసరి ఏ హీరోలకు ఎలాంటి ట్యాగ్స్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…
దాసరి బాలయ్య గురించి మాట్లాడుతూ బాలకృష్ణ అందమైన నటుడు అంటూ ట్యాగ్ ఇచ్చారు.రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ఏదైనా కొత్త పాత్రలలో చేయాలంటే రాజశేఖర్ అయితే బాగుంటుంది. అలా చేయడం అతనికే సాధ్యం అంటూ రాజశేఖర్ గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఈయన ఓ స్టార్ హీరో అంటూ దాసరి చిరుకి ట్యాగ్ ఇచ్చారు. ఇక నాగార్జున గురించి మాట్లాడుతూ నాగార్జున ఒక తెలివైన నటుడు, ఇక తన శిష్యుడు మోహన్ బాబు గురించి మాట్లాడుతూ మోహన్ బాబు ఒక గ్రేట్ ఆర్టిస్ట్.. హీరో కన్నా గొప్ప నటుడు అంటూ మోహన్ బాబుకు ట్యాగ్ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…