Featured

Pavan Kalyan : పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ ఎవరికోసం.. పరోక్షంగా నిహారికను మందలించారా..!?

Pavan Kalyan : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ పబ్ లో జరిగిన దాడుల్లో నిహారిక కొణిదెల పేరు రావడం చర్చకు దారి తీసింది. ఇక ఈ ఉదంతం పై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది మెగా ఫ్యామిలీ. నాగబాబు వెంటనే స్పందించి నిహారిక కు డ్రగ్స్ విషయం లో ఇలాంటి సంబంధం లేదని అనవసరంగా కల్పితాలను ప్రచారం చేయొద్దని సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసారు.

ఇక నిహారికతో పాటు పబ్ లో ఉన్న సాయి రాజేష్ అనే యువ దర్శకుడు వరుస ట్వీటర్ లో అసలు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసాడు.అసలు డ్రగ్స్ కు మాకు సంబంధం లేదని పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయలేదని చెప్పారు. అనవసరంగా నిహారిక పేరు ను తీసుకొచ్చారని చెప్పారు. ఇక గల్లా జయదేవ్ కుమారుడి విషయం లోనూ వాళ్ళు ఫ్యామిలీ మీడియా కు ఒక నోట్ వదిలారు. గల్లా అశోక్ కు ఆ పబ్ తో సంబంధం లేదని అనవసరంగా ఇందులోకి తన పేరును లాగుతోందని మీడియా కు వివరించారు.

పవన్ పోస్ట్ ఎవరికీ…..

నిహారిక ఇష్యూ మెగా ఫ్యామిలీ ని బాగానే ఇబ్బంది పెడుతోంది. మారి ఎక్కువగా పవన్ రాజకీయాలపై ఈ ప్రభావం పడనుంది. నీతులు చెప్పే ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి అంటూ ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.అందుకేనేమో పవన్ సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ ను పెట్టారు. అందులో ఖచ్చితంగా నిహారిక ను మందలిస్తూ పెట్టారనే విషయం క్లారిటీ రాకపోయినా అందరు మాత్రమే పరోక్షంగా మందలించారాని అనుకుంటున్నారు.

ఆ పోస్ట్ లో పవన్ ఇలా రాసుకొచ్చారు బీసీలు, ఎస్సీలు క‌లిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్‌మ‌నోహ‌ర్ లోహియా ఆలోచ‌న‌ల్ని పంచుకుంటూ ర‌చ‌యిత వాకాడ శ్రీ‌నివాస్ వాఖ్యలను తాను ప్ర‌స్తావిస్తున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. “శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది… అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…” అని ట్వీట్ చేశారు. ఇక తన అన్న కుమార్తె నిహారిక పేరుపై ర‌చ్చ సాగుతుండ‌డంపై ప‌వ‌న్ త‌న అస‌హ‌నాన్ని ప‌రోక్షంగా వెల్ల‌డించిన‌ట్టు చెబుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంద‌ని ప‌వ‌న్ ట్వీట్ సారాంశంగా చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago