Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా పరిచయమైన నాగశౌర్య ఎంతో విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకొని హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగశౌర్య చందమామ కథలు సినిమా సమయంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి నాగశౌర్య బంధువు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
నాగశౌర్య ఎన్టీఆర్ భార్య ప్రణతి కజిన్ బ్రదర్ అనే ఊహాగానాలు వినిపించాయి.ఈ విధంగా అప్పటి నుంచి ఎన్టీఆర్, నాగశౌర్య బంధువులు అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే నాగశౌర్య తల్లి ఉషారాణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం గురించి వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి కజిన్ బ్రదరే నాగ శౌర్య అని వార్తలు వచ్చాయి ఇది నిజమేనా అని ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు ఉషారాణి సమాధానం చెబుతూ అసలు విషయం వెల్లడించారు. నాగ శౌర్య ఎన్టీఆర్ ఫ్యామిలీ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఉషారాణి తెలిపారు.
తారక్ అంటే మా అందరికీ ఎంతో అభిమానం. అంతేకానీ ఇలాంటి రిలేషన్ లేదని తెలిపారు. ప్రణతి వాళ్ల కజిన్ నాగ శౌర్యకి ఫ్రెండ్. అలా వీరి గురించి రూమర్స్ వచ్చి ఉంటాయి కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదని ఉషారాణి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…