Pavan Kalyan : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ పబ్ లో జరిగిన దాడుల్లో నిహారిక కొణిదెల పేరు రావడం చర్చకు దారి తీసింది. ఇక ఈ ఉదంతం పై దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది మెగా ఫ్యామిలీ. నాగబాబు వెంటనే స్పందించి నిహారిక కు డ్రగ్స్ విషయం లో ఇలాంటి సంబంధం లేదని అనవసరంగా కల్పితాలను ప్రచారం చేయొద్దని సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసారు.

ఇక నిహారికతో పాటు పబ్ లో ఉన్న సాయి రాజేష్ అనే యువ దర్శకుడు వరుస ట్వీటర్ లో అసలు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసాడు.అసలు డ్రగ్స్ కు మాకు సంబంధం లేదని పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయలేదని చెప్పారు. అనవసరంగా నిహారిక పేరు ను తీసుకొచ్చారని చెప్పారు. ఇక గల్లా జయదేవ్ కుమారుడి విషయం లోనూ వాళ్ళు ఫ్యామిలీ మీడియా కు ఒక నోట్ వదిలారు. గల్లా అశోక్ కు ఆ పబ్ తో సంబంధం లేదని అనవసరంగా ఇందులోకి తన పేరును లాగుతోందని మీడియా కు వివరించారు.
పవన్ పోస్ట్ ఎవరికీ…..
నిహారిక ఇష్యూ మెగా ఫ్యామిలీ ని బాగానే ఇబ్బంది పెడుతోంది. మారి ఎక్కువగా పవన్ రాజకీయాలపై ఈ ప్రభావం పడనుంది. నీతులు చెప్పే ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి అంటూ ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.అందుకేనేమో పవన్ సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ ను పెట్టారు. అందులో ఖచ్చితంగా నిహారిక ను మందలిస్తూ పెట్టారనే విషయం క్లారిటీ రాకపోయినా అందరు మాత్రమే పరోక్షంగా మందలించారాని అనుకుంటున్నారు.
ఆ పోస్ట్ లో పవన్ ఇలా రాసుకొచ్చారు బీసీలు, ఎస్సీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్‌మనోహర్ లోహియా ఆలోచనల్ని పంచుకుంటూ రచయిత వాకాడ శ్రీనివాస్ వాఖ్యలను తాను ప్రస్తావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. “శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది… అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…” అని ట్వీట్ చేశారు. ఇక తన అన్న కుమార్తె నిహారిక పేరుపై రచ్చ సాగుతుండడంపై పవన్ తన అసహనాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు చెబుతున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైందని పవన్ ట్వీట్ సారాంశంగా చెబుతున్నారు.
The following quote by Writer’Sri Vakada Srinivas’ reflects the RamManohar Lohia’s thought process on the ascension of BC’s & SC’s into power.
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2022
“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…”

































