Samantha: వేణు స్వామి ప్రస్తుతం వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వేణు స్వామి తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వారి జాతకాలను చెప్పడంతో ఈయన వివాదాలలో నిలిచారు. ఇటీవల నాగచైతన్య శోభిత జాతకం గురించి ఈయన మాట్లాడటంతో పెద్ద ఎత్తున వివాదంగా మారింది.
ఎంతోమంది తెలుగు ఫిలిం జర్నలిస్టులు మండిపడటమే కాకుండా ఈయనపై మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడంతో ఈయన అరెస్టు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే వేణు స్వామి భార్య వీణ వాణి రంగంలో దిగి మీడియా వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలోనే వేణు స్వామి సమంతకు సంబంధించి మరొక విషయాన్నీ వెల్లడించారు.
వేణు స్వామి మరోసారి సమంత పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2013 లో తాను సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పాను. నేను చెప్పిన విధంగానే వాళ్ళు విడిపోయారు. నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత సమంతను ఎవరు పట్టించుకోలేదు.దీంతో ఈమె డిప్రెషన్ లోకి వెళ్లి మాయోసిటీసీస్ కి గురి అయ్యిందని తెలిపారు. ఎంతో ధైర్యంతో కోలుకుని, ప్రస్తుతం ఆమె మరల హిట్ సినిమాలు చేస్తుందని తెలిపారు.
రెండో పెళ్లి చేసుకొని…
సమంత తెలుగు అమ్మాయి కాకపోవడంతో ఈమెకు అవకాశాలు రాకుండా కొందరు కావాలనే సమంతా వ్యవహారం సైడ్ ట్రాక్‌కు వెళ్లేలా చేసి.. తనపై లేని పోనీ విధంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. గతంలో తాను ఒక అమ్మాయికి జాతకం చెప్పాను అయితే మనం అమ్మాయి కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే తన గురించి ఇలా చెప్పానని తెలిపారు. సమంత రెండో పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…