Pitapuram: మరొక వారం రోజులలో ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అని చెప్పాలి.
పిఠాపురం ఎన్నికల ఫలితాలపై ఇటు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలకు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి పిఠాపురం ఎన్నికల ఫలితాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వేణు స్వామి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలవడం కష్టమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జాతకం పరంగా ఆయనకు రాజకీయాలలో కొనసాగే యోగమే లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు సినిమాలలో మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ రాజకీయంగా ఆయన విజయం సాధించలేరని తెలిపారు.
రాజకీయ యోగం లేదు..
ఇలా వేణు స్వామి పవన్ కళ్యాణ్ గెలుపు గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వేణు స్వామి పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయం గురించి ఇప్పటికీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…