నవంబర్ 2021 నుంచి.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి గురించిన పుకార్లు.. షికార్లు చేశాయి. అవి నిజమా కాదా అని ఎంతో మంది అనుమానం వ్యక్తం చేశారు. అదే పుకార్లను నిజం చేస్తూ.. డిసెంబర్ 9, 2021న కత్రీనా , విక్కీ తమ వివాహ వేడుకకు సంబంధించి చిత్రాలను పోస్ట్ చేయడం ద్వారా అన్ని ఊహాగానాలకు ముగింపు పలికారు. ఈ పెళ్లి బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది హాజరయ్యారు.
పెళ్లికి వెళ్తే.. ఎవరైనా గిఫ్ట్ తీసుకెళ్లడం అనేది ఎవరికైనా ఆనవాయితీ. ఇక ఈ పెళ్లిలో కూడా అతిరథ మహానటులు, నటీమణులు కూడా ఖరీదైన గిఫ్ట్ లను బహుకరించి మంత్రముగ్దులను చేసేశారు. ఆగిఫ్ట్ లు ఏంటో.. ఎవరు ఇచ్చారో ఇక్కడ తెలుసుకుందాం..విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్‌ల వివాహానికి.. కత్రినా మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ఆమెకు కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చాడు.
దాని విలువ ఎంతో తెలుసా.. 2.7 కోట్లు. ఆ ఖరీదైన గిఫ్ట్ చూసి కత్రినా షాకైందట. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరి జంటకు కలిపి రూ. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ను బహుమతిగా ఇచ్చాడు. బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ ఫర్‌ఫ్యూమ్ బాస్కెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని విలువ దాదాపుగా లక్షల్లోనే ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా.. వీరిద్దరిని ఆకట్టుకునే బహుమతులు బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖుల నుంచి ఎన్నో వచ్చాయి.
షారూక్ ఖాన్ రూ.1.5లక్షల విలువ జేసే ఖరీదైన పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగా.. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ బీఎమ్‌డబ్ల్యూ జీ-310ఆర్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాప్సీ.. విక్కీ కౌశల్‌కి విలువైన ప్లాటినం బ్రాస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చింది. దీని విలువ 1.4 లక్షలు. విక్కీ కౌశల్, తాప్సీ కలిసి గతంలో నటించారు. ఇక చివరగా.. వధువు.. వరుడి కోసం మరో గిఫ్ట్ ను ఇచ్చింది. అదేంటంటే.. కత్రినా విక్కీకి ముంబైలోని జుహులో రూ.15 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…