కష్టపడడం నేర్చుకోవాలంటే మనం చీమలని, తేనెటీగలను ఎంతో ఆదర్శంగా తీసుకోవాలి. అవి ఎంతో కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటాయి. చీమలు భవిష్యత్తు గురించి ఆలోచించి ఆహారాన్ని పోగు చేసుకోవడంలో ఎంతో కష్టపడుతూ ఉంటాయి. అదేవిధంగా తేనేటీగలు తమ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాయి. రాణి తేనెటీగల కోసం కూలి తేనెటీగలు ఎంతో కష్టపడుతుంటాయి.
ఈ క్రమంలోనే పువ్వులలో మకరందం నుంచి తేనెను సేకరించి తేనెను పోగు చేయడంలో తేనెటీగలు నిరంతరం కృషి చేస్తుంటాయి. కేవలం పువ్వులలో ఉండే మకరందం పై మాత్రమే కాకుండా ఏదైనా తీపి పదార్థాలు కనిపిస్తేచాలు తేనెటీగలు వెంటనే అక్కడే వాలిపోతాయి. తేనెటీగలు తమ తెలివితేటలను కూడా ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తాయి.
ఈ క్రమంలోనే రెండు తేనెటీగలకు ఓ ఫాంట్ కూల్ డ్రింక్ బాటిల్ కనిపించింది. అయితే ఆ బాటిల్ మూత పెట్టి ఉంది.దీంతో రెండు తేనెటీగలు ఆ బాటిల్ మూత వద్దకు చేరుకొని బాటిల్ మూత తీయడానికి రెండు తేనేటీగలు చెరోవైపు వెళ్లి బాటిల్ మూతను అపసవ్య దిశలో తీయడం మొదలు పెట్టాయి.
ఈ విధంగా తేనేటీగలు రెండు బాటిల్ మూతను అపసవ్యదిశలో తిప్పుతూ ఎట్టకేలకు బాటిల్ మూతను తెరిచాయి. ఈ విధంగా తేనేటీగలు ఎంతో కలసికట్టుగా బాటిల్ మూత తెరవడానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే తేనెటీగల టీమ్ వర్క ను మెచ్చుకోకుండా ఉండలేరు. మరెందుకాలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…