Vijay Antony: తమిళ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో మరింత ఆదరణ సంపాదించుకున్నారని చెప్పాలి. బిచ్చగాడు సినిమా తమిళ భాషలతో పాటు తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో భాగంగా మలేషియాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా నటుడు విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా బోటులో ప్రయాణం చేస్తున్నటువంటి సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉండగా విజయ్ ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి మరొక బోటును ఢీ కొట్టింది దీంతో ఈయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే స్పందించిన చిత్ర బృందం అతనిని మలేషియాలోని ఒక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.అయితే ఈ విషయం తెలుసుకున్న టువంటి విజయ్ కుటుంబ సభ్యులు వెంటనే మలేషియా చేరుకొని ఆయనని చెన్నై తీసుకువచ్చారు. ప్రస్తుతం చెన్నైలో ఈయనకు చికిత్స అందుతుంది. విజయ్ కు ఇప్పటివరకు మెలకువ రాలేదని ఆయన పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆయన సతీమణి తెలిపారు.
ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని తెలియజేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయటపడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అయితే బిచ్చగాడు 2సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని అయితే ఈ సినిమా చివరి షూటింగ్లో భాగంగా ఇలా ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…