Vijay Devarakonda : సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి వరుసగా ఒక మూడు సినిమాలు చేస్తే ఇక ఆ సినిమాలో వాళ్ళ కెమిస్ట్రీ బాగా ఉంటే అయిపోయింది. ఇక ఆహీరో హీరోయిన్ల అభిమానులు వాళ్లిదరూ రిలేషన్ లో ఉన్నారని ప్రేమించుకుంటున్నారని, పెళ్లిచేసుకుంటారని ఏవేవో అనేసుకుంటారు. ఇక మీడియాలో కూడా వారిపై డబల్ ఫోకస్ పెట్టి, వాళ్ళు బయటకొస్తే చాలు ఏవేవో రాసేస్తారు. అలానే ఇప్పడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన మీద కూడా వాళ్లిదరి మధ్య ఏదో ఉంది అంటూ చాలా రోజులుగా అందరూ అనుమానపడుతున్నారు. ఇక దీనికి తోడు వాళ్లిద్దరూ కలిసి ప్రైవేట్ గా కలవడం ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్లడం, డేట్ కి వెళ్లడం మరింత వీళ్ళ రిలేషన్ మీద అనుమానలను పెంచాయి. కానీ రష్మిక, విజయ్ లు మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్, మా మధ్య ఇంకేం లేదు అంటూ చెప్పారు. అయినా ఎవరూ నమ్మరు ఇంకా వీళ్లిదరూ రిలేషన్ లో ఉన్నారనే అభిమానులు అనుకుంటున్నారు.
ఔను వాళ్లిద్ధరు.. హింట్ ఇచ్చిన అనన్య…
ఇక ఈ యవ్వారం మీద విజయ్ ను కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ అడిగాడు. లైగర్ ప్రమోషన్స్ కోసం షోకి విజయ్ అనన్య వచ్చి సందడి చేసారు. ఇక ఈ షోలో విజయ కి కరణ్ నీకు, రష్మిక కు మధ్య ఏముంది అని అడుగగా, విజయ్ ఎప్పటిలాగే మేమిద్దరం ఫ్రెండ్స్.. అన్నీ షేర్ చేసుకుంటాం, మా మధ్య దాపరికలు లేవు అంటూ చెప్పాడు. మీరనుకుంటున్నట్లు మా మధ్య ప్రేమ ఏం లేదు మంచి స్నేహితులం అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక కరణ్ జోహార్ మాత్రం సంతృప్తి చెందాలేదేమో అనన్య ను విజయ్ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అని అడిగాడు. దానికి అనన్య అస్సలు ఆలోచించకుండా, విజయ్ తొందరపడుతున్నాడు మీకా.. మీకా.. సింగ్ ను కలిసేందుకు అంటూ చెప్పకనే చెప్పి రష్ .. మీకా అంటూ హింట్ ఇచ్చింది. పరోక్షంగా వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని చెప్పింది. ఇక విజయ్ ఆ మాటలకు పెద్దగా ఆశ్చర్య పోలేదు. నీకు అలా అనిపిస్తుందా అంటూ నవ్వాడు. ఇక కరణ్ జోహార్ నొక్కి నొక్కి రష్.. మీకా.. అంటూ అనడంతో అందరికి రష్మిక అనే విషయం అర్థమైంది. ఇక నెటిజన్స్ కూడా హో రష్… మీకా నా సరే అంటూ ఫన్నీగా స్పందించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…