Categories: FeaturedMovie News

Liger : హీరోయిన్ ఒడిలో తలపెట్టుకుని మరీ సినిమాకు ప్రొమోషన్స్… విజయ్ ‘తల’ పెట్టిన కార్యం హిట్ అవ్వాలంటూ నెట్టింట్లో పోస్ట్లు…!

Liger : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన సినిమా లైగర్. రమ్యకృష్ణ, మైక్ టైసన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమా టీజర్, ట్రైలర్ వల్ల బాగా హైప్ వచ్చి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఫ్యాన్స్ ను థియేటర్ రప్పించడానికి సరిపోతాయి. మరి కామన్ ప్రేక్షకుడు సినిమాకు రావాలంటే ఇంకేదో చేయాలి. ఒకటి కంటే ఎక్కువ భాషలలో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ మీద పూరీ, విజయ్, బాగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాకు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. రన్వీర్ సింగ్ ను టీజర్ లాంచ్ కి పిలవడం, అది ముంబై లోనే ఈవెంట్ చేయడం, ఇక కాఫీ విత్ కరణ్ వంటి షోలో పాల్గొనడం ఇవన్నీ హిందీ లో సినిమాకు హైప్ తీసుకురావడానికే. కానీ ఇవేవీ సరిపోవు అందుకే ఇంకా కొత్తగా ఆలోచించారు పూరీ, విజయ్.

ముంబై లోకల్ ట్రైన్ లో హీరోయిన్ తో…

సినిమా గురించి విడుదల అయ్యే రోజు వరకు ఏదో ఒకలాగా ప్రేక్షకుడు మాట్లాడితే సినిమాకు మంచి ప్రొమోషన్స్ వచ్చి సినిమాను థియేటర్ లో చూడడానికి ఆడియన్స్ వెళ్తారనేది సినిమా టీం నమ్మకం. అందుకే సినిమా ప్రమోషన్స్ ను తమ భుజాన వేసుకుని మరీ చేస్తుంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం భుజాన వేసుకోకుండా ఒళ్ళో పడుకొని మరీ చేస్తున్నాడు. లైగర్ ప్రమోషన్స్ కోసం ముంబై లోకల్ ట్రైన్ లో అనన్య పాండే తో కలిసి ప్రయాణించిన విజయ్ దేవరకొండ.

ప్రమోషన్స్ కోసం తిరిగి అలసిపోయాడేమో పాపం హీరోయిన్ అనన్య పాండే ఒళ్ళో తల పెట్టుకుని ఒక పవర్ నాప్ తీసేసాడు. ఇక హీరోయిన్ కూడా విజయ్ ని ఒళ్ళో పడుకో బెట్టుకుని తాను ఆనుకుని ఉన్న సీట్ కి తల వాల్చి కునుకు తీసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమవడంతో నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘తల’ పెట్టిన కార్యం సక్సెస్ అవ్వలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago