Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన వేణు తోట్టెంపూడి ఆ తరువాత చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరేళితే వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. వివిధ కారణాలతో సినిమాలకు తోమిదేళ్లుగా దూరంగా ఉన్న వేణు మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా పోలీస్ ఆఫీసర్ మురళి గా రాబోతున్నాడు. ఈ సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వేణు తన ముందు సినిమాల గురించి మాట్లాడారు.
సునీల్ ఇపుడు నచ్చడం లేదు…
అప్పట్లో వేణు, సునీల్ కాంబినేషన్ మంచి హిట్. పెళ్ళాం ఊరేళితే, చెప్పవే చిరుగాలి, కళ్యాణ రాముడు వంటి సినిమాల్లో వీరి కామెడీ బాగా హిట్ అయింది. ఇద్దరి కామెడీ టైమింగ్ అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చేది. ఇక వేణు తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరమవ్వడం, ఈ సమయంలో సునీల్ హీరోగా హిట్ కొట్టడం, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం, తాజాగా విలన్ గా సినిమాల్లో చేస్తున్నారు.
ఇక సునీల్ వేణు కి మంచి మిత్రుడు కూడా అవడంతో సునీల్ గురించి అడుగగా అప్పట్లో సునీల్ మాట్లాడితేనే నవ్వొచ్చేది అయితే ఇపుడు సునీల్ కామెడీ చేయడం లేదు విలన్ గా, హీరోగా చేస్తున్నారు. విలన్ గా అయితే సునీల్ నటించాలి, కానీ కామెడీ నటించనవసరం లేదు తాను మాట్లాడితే నవ్వొస్తుంది అందరికి. అందుకే నాకు అప్పటి సునీల్ ఇష్టం, ఇపుడు నాకు నచ్చలేదు కానీ తాను డిఫరెంట్ పాత్రలు చేస్తూ సినిమాల్లో నటించడం నాకు బాగా అనిపించింది. అన్ని రకాల పాత్రలకు న్యాయం చేస్తున్నారు అంటూ సునీల్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక తనతో కలిసి నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా మరచిపోలేనిది అంటూ చెప్పారు వేణు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…