Venu Thottempudi: వేణు తొట్టెంపూడి స్వయంవరం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతరం చిరునవ్వు హనుమాన్ జంక్షన్ పెళ్ళాం ఊరెళితే వంటి ఎన్నో సినిమాలలో నటించారు. ఇలా ఎన్నో సినిమాలలో హీరోగా సహాయ నటుడిగా నటించిన వేణు చివరిసారిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దమ్ము సినిమాలో నటించారు. ఈ సినిమా అనంతరం వేణు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈయన రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటించారు.ఇలా చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వేణు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.
ఈ క్రమంలోని తను దేశముదురు సినిమాని మిస్ చేసుకున్నానని తెలిపారు. అదేవిధంగా దమ్ము సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాను నటించిన సన్నివేశాలన్నీ తొలగించారంటూ తెలియజేశారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా లో నటించే అవకాశం కూడా తనకు వచ్చిందని తెలిపారు.
అతడు సినిమాలో సోను సూద్ నటించిన పాత్ర చేసే అవకాశం ముందుగా తనకు వచ్చిందని అయితే కొన్ని కారణాలవల్ల ఆ పాత్రలో తాను నటించలేకపోయానని ఈ సందర్భంగా వేణు తెలిపారు.ఇలా మహేష్ బాబుతో తాను స్క్రీన్ షేర్ చేసుకుని అవకాశాన్ని కోల్పోయానని ఈ సందర్భంగా వేణు అతడు సినిమా గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…