Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…