Movie News

Vijay Sethupathi: “తెలియక చేసాడు.. క్షమించండి..” కొడుకు వివాదంపై క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి

పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి, తన కుమారుడు సూర్యకి సంబంధించిన వివాదంపై తాజాగా స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే…

Vijay Sethupathi apologizes for son controversy

విజయ్ సేతుపతి తనయుడు సూర్య, జూలై 4న విడుదలైన ‘ఫీనిక్స్’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి స్పందన అందుకున్న సూర్య నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, సినిమా ప్రీమియర్‌కు సంబంధించిన కొన్ని వీడియోలపై తీవ్ర వివాదం చెలరేగింది.

సూర్య ప్రీమియర్‌లో తీసిన వీడియోలను డిలీట్ చేయాలని మీడియాపై ఒత్తిడి తెచ్చారు అంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ వివాదంపై స్పందించిన విజయ్ సేతుపతి. “నిజంగా అలాంటి ఒత్తిడి తీసుకువచ్చి ఉంటే, అది తెలియక జరిగి ఉండవచ్చు లేదా ఇతరుల ద్వారా జరిగి ఉండొచ్చు. కానీ ఎవరికైనా బాధ కలిగితే, నా తరఫున క్షమాపణలు చెబుతున్నా” అని పేర్కొన్నారు.

ఈ ఘటనపై విజయ్ స్పందించడంతో అభిమానులు ఆయన వినయాన్ని, బాధ్యతాయుతమైన వైఖరిని ప్రశంసిస్తున్నారు. ఫీనిక్స్ సినిమాలో సూర్యతో పాటు దేవదర్శిని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సినిమా దర్శకుడు అనల్ అరసు కాగా, ఈ చిత్రం ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది.

telugudesk

Recent Posts

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

25 minutes ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

2 hours ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

2 hours ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

2 hours ago

గురువారం పూజతో అదృష్టం మారుతుందా? కాశీలో అరుదైన బృహస్పతి ఆలయం.. గురు దోషాలకు ప్రత్యేక పరిష్కారం!

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…

3 hours ago

రూ.10 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మంగ్లీపై వివాదం మరింత ముదురు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…

3 hours ago