Vijaya Shanthi: ఇటీవల గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని మరియు అడ్డుకున్న గోసంరక్షకులను కంపేర్ చేస్తూ హీరోయిన్ సాయిపల్లవి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై సీనియర్ నటి విజయశాంతి స్పందించారు. ప్రస్తుతం సాయి పల్లవి మీద విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
దేని గురించి అయినా సమగ్ర అవగాహనతో… సామజిక స్పృహతో స్పందించాలి…
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై విజయశాంతి ఈవిదంగా స్పందించారు… మతోన్మాదంతో కాశ్మీర్ లో పండితులపై మారణకాండ సృష్టించడం… ధర్మం కోసం మన దైవసమానమైన గోవులను కాపాడుకోవాలి అని గోరక్షకులు చేసే పోరాటం ఒకటి ఏవిదంగా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. డబ్బు కోసం ఒక దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం, తల్లి తన తప్పు చేసిన పిల్లవాడిని దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా ఎలా చూస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే తమకు అవగాహన లేకపోతే ఆ విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆవిషయాలను పక్కన పెట్టడం మంచిది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో మనం మాట్లాడే ప్రతి మాట నిముషాలలో జనంలోకి వేలుతోంది. మనం మాట్లాడే మాటల్లో ఏమాత్రం తేడా ఉన్నా సమాజం నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకే ఏదైనా మాట్లాడితే సమగ్ర అవగాహనతో, ఇంకా సామజిక స్పృహతో స్పందించాలి అని అభిప్రాయపడ్డారు. మరో వైపు తమ సినిమా ప్రమోషన్ కోసం కావాలనే కాశ్మీర్ ఫైల్స్ సినిమా అంశాన్ని తీసుకువచ్చి హీరోయిన్ని వివాదలలోకి లాగి ప్రజల ద్రుష్టి ఆకర్షస్తున్నారు అన్న సమాచారం కూడా వుంది అని తెలియజేసారు విజయశాంతి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…