Movie News

Vijayshanthi: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. పరోక్షంగా చిరు పై సెటైర్స్?

Vijayshanthi: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. గతంలో అమీర్ ఖాన్ భారతదేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియాలో ఉండాలంటే అసహనం వేస్తుందని, ఇక్కడ రక్షణ లేదు, ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రస్తుతం ఎంతోమంది నేటిజన్ లు తన సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి బిజెపి నాయకురాలు విజయశాంతి సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి స్పందిస్తూ ప్రజలను నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలు అర్థమయ్యేలా అమీర్ ఖాన్ కు చెబుతున్నారని ఈమె ట్వీట్ చేశారు. గతంలో సర్కారుపై వ్యతిరేకతతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

మనదేశంలో స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవాన్ని ఇస్తుంది. ఈ వాస్తవం తెలిసిన ప్రజలు అమీర్ ఖాన్ సినిమాలను బాయికాట్ చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ఆయన నటించిన వాణిజ్య ఉత్పత్తులను సైతం తిరస్కరిస్తున్నారనీ విజయశాంతి పేర్కొన్నారు.

Vijayshanthi: చిరంజీవిని కూడా టార్గెట్ చేసిన విజయశాంతి…

ఇక ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అందర్నీ మేలుకొలుపుతుంటే.. కొందరు టాలీవుడ్ హీరోలు మాత్రం ప్రజల మనోభావాలు వాళ్ళకి తెలియవు అన్నట్టుగా అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ టీవీలలో కనిపిస్తున్నారని పరోక్షంగా ఈమె చిరంజీవిని కూడా ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ గురించి విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

7 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

7 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

12 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

13 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

13 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

13 hours ago