Featured

Vikram & Srivani : శ్రీవాణి, విక్రమాదిత్య మూడు సార్లు పెళ్లి… వదినతో ఆస్తి కోసం గొడవ… న్యూడ్ కాల్స్ తో బెదిరింపులు…: సీరియల్ ఆర్టిస్ట్ శ్రీవాణి & విక్రమ్

Vikram &Srivani : సంఘర్షణ, చంద్రముఖి, రాములమ్మ వంటి పలు సీరియల్స్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటి శ్రీవాణి. పన్నెండు ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ కి వచ్చిన శ్రీవాణి సినిమాల్లో అలాగే సీరియల్స్ లో నటిస్తూ యాంకరింగ్ కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక చిన్నవయసులోనే డాన్స్ మాస్టర్ అలాగే ఈవెంట్ మేనేజర్ అయినా విక్రమాదిత్య రెడ్డినీ పెళ్లి చేసుకున్నారు శ్రీవాణి. ఇక రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరింత తన ఫాన్స్ కి చేరువైన శ్రీవాణి తన కూతురు భర్త తో కలిసి వీడియోలను చేస్తూ పాపులర్ అయ్యారు. తాజాగా యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లో శ్రీవాణి అలాగే ఆమె భర్త వారి వ్యక్తిగత జీవితం అలాగే వాళ్ళు పడిన ఇబ్బందులను గురించి పంచుకున్నారు.

మూడు సార్లు పెళ్లి… వదినతో గొడవలు…

శ్రీవాణి నీ ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఆమె భర్త విక్రమ్ గారే నట. ఆమె భర్తకు ఆమెకు ఏడేళ్లు వయసు తేడా ఉండగా అప్పటికే డాన్స్ మాస్టర్ గా ఉన్న ఆయన ఈవెంట్స్ కోసం వెతుకుతుండగా శ్రీవాణిని తెలిసిన వాళ్ళ ద్వారా సెలెక్ట్ చేసి ఆమెను తన డాన్స్ ఈవెంట్ కోసం తీసుకున్నారట. ఆ పరిచయం ప్రేమగా మారడానికి చాలా ఏళ్ళే పట్టింది. మొదట విక్రమ్ గారే ప్రపోజ్ చేయగా మొదటి నుండి ఆయన తెలియడం వాళ్ళ కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉండటం వల్ల ఒకే చెప్పేసిందట శ్రీవాణి. లేచిపోయి పెళ్లి చేసుకోవాలని విక్రమ్ గారికి మొదటి నుండి కోరిక ఉండటం వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకుంటారని తెలిసిన వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారట. ఆ పైన తల్లిదండ్రులు పెళ్లి చేశారట. అపైన జీ తెలుగులో ఒక ప్రోగ్రాం కోసం రియల్ జంటకు పెళ్లి చేసారట అలా మూడు సార్లు పెళ్లయిందంటూ చెప్పారు శ్రీవాణి.

ఇక తన గురించి గతంలో వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడుతూ తన అన్న భార్య తో గొడవ విషయంలో మీడియా సృష్టించినవే. నేను ఇల్లు కూలగొట్టాను, బెదిరించాను అంటూ ఏవేవో రాసారు అవన్నీ అపద్దలని నిరూపించిన మీడియా వాళ్ళు వదల్లేదు అంటూ చెప్పారు శ్రీవాణి. ఇక విక్రమ్ గారికి తెలియని ఒక మహిళ న్యూడ్ కాల్ చేసి బెదిరించాలని చూస్తే ఆమె కాల్ చేసినపుడు రికార్డు చేయడం వల్ల ఏమి చేయలేకపోయారంటు చెప్పపారు విక్రమ్. డబ్బులు ఇవ్వాలని లేకపోతే మీడియాలో వీడియో పెడతామని బెదిరించిన పెట్టండి నేను రికార్డు చేసిన వీడియో పెడతానని చెప్పే సరికి ఏమి చేయలేక పోయారు అంటూ విక్రమ్ తెలిపారు. ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల ఎటువంటి సమస్యలు రాలేదంటూ చెప్పారు శ్రీవాణి,ఆమె భర్త.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago