Featured

Vilan Madhusudhan Rao : మేము సినిమాల్లోనే విలన్స్… బయట కాదు… మా అక్క పిల్లల బాధ్యత నేనే తీసుకున్నాను…: విలన్ మధుసూదన్ రావు

Vilan Madhusudhan Rao : విలన్ గా తెలుగులోనూ అటు తమిళ, కన్నడ, మలయాళంలోనూ నటిస్తున్నారు మధుసూదన్ రావు. అయితే తెలుగు ప్రేక్షకులకు మధుసూదన్ రావు అనగానే ఎవరు అని సందేహం రావొచ్చు. అయితే చక్రవాకం సీరియల్ జేమ్స్ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఆ సీరియల్ లో కూతురుని ప్రేమించే తండ్రిగా, ఒక విలన్ గా మంచి స్నేహితుడిగా చక్కగా నటించారు. అయితే సినిమాల్లో ఆశించినంత గా మంచి పాత్రలలో నటించలేదు మధుసూదన్ రావు గారు. తెలుగులో మంచి విలన్ పాత్రలు ఇంకా దొరకలేదు కానీ ఇతర భాషలలో మాత్రం మంచి విలన్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక మధుసూదన్ గారి భార్య శృతి కూడా ఫేమస్ టెలివిజన్ నటి. మొగలిరేకులు వంటి సీరియల్ లో ‘పాటి’ పాత్రలో ఆధరగొట్టారు.

సినిమాల్లోనే విలన్ నిజ జీవితంలో కాదు…

మధుసూదన్ గారిని ఇప్పటికీ బయట తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టి జేమ్స్ అంటూ పలకరిస్తారట. ఇక ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ విలన్ పాత్రలు పోషించే ఎంతోమంది నిజ జీవితంలో చాలా సున్నితంగా ఉంటారంటు తెలిపారు. తన అక్క భర్త చనిపోవడం తో వారి బాధ్యత తానే తీసుకున్నట్లు తన అక్క, మావయ్య అంటే చాలా ఇష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు. వారి బాధ్యత తీసుకోవడం వల్ల సినిమాల్లో ఏదో ఒక పాత్ర వస్తే అవి చేస్తూ వెళ్లిపోయానంటూ తెలిపారు మధుసూదన్ రావు.

ఇప్పటికీ తన మావయ్య మరణించినది గుర్తుకు వస్తే కళ్ళలో నీళ్ళొస్తాయంటూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఎన్నో చూసానని కానీ నా తల్లిదండ్రులు నేర్పిన మంచితనం, సహాయం పడే గుణం నాతో అలానే కొనసాగుతున్నాయంటూ తెలిపారు. నా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం లేదు నేను ఎన్నో కష్టాలు పడ్డాను అలానే కష్టాలు పడుతున్న వారికి సహాయం చేయాలనీ అనుకుంటాను. తెలుగులో అవకాశాలు బాగా రాక పోయిన తమిళంలో నన్ను బాగా ఆదరిస్తున్నారు అది చాలు నాకు అంటూ తెలిపారు మధుసూదన్ రావు.

Bhargavi

Recent Posts

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

1 minute ago

కేసు విచారణలో కీలక మలుపు.!మోహన్ బాబు ను అరెస్ట్ చేస్తారా.?

మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…

6 minutes ago

T20 World Cup 2026 : సూపర్-8లో హై వోల్టేజ్ మ్యాచ్‌లు.. టీమిండియా ఏ రోజు ఏ జట్టుతో భారత్ పోరు? ఫుల్ షెడ్యూల్ ఇదే!

అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…

8 minutes ago

బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు… వివాదానికి కొత్త మలుపు..!

రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ సంస్థ లీగల్…

15 minutes ago

Today Horoscope:ఈ రాశివారికి అదనపు ఆదాయం… మరికొన్ని రాశులకు హెచ్చరిక.!

ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…

21 minutes ago

అంబటి రాంబాబును ఏం చేయబోతున్నారు??!వైసీపీ తదుపరి వ్యూహం ఏంటి?

బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్‌పై జైలు నుంచి…

27 minutes ago