Viral Video: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. అయితే తమ అభిమాన నటీనటులతో కలిసి ఒక ఫోటో దిగాలని ఎంతోమంది ఆతృత పడుతుంటారు. ఇలా కొందరు అభిమానులు అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. అయితే తమ అభిమాన హీరో హీరోయిన్లను కలవడం కోసం అభిమానులు చేసే పనులకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇదివరకే ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అభిమానిని అంటూ ఒక వధువు పెళ్లి పీటల పై నుంచి తనతో ఫోటో దిగడం కోసం ఏకంగా తన హోటల్లో బస చేస్తున్న రూమ్ దగ్గరకు వెళ్ళింది.మరికొన్ని గంటలలో తన పెళ్లి జరుగుతుందని కింద తన కోసం పెళ్లి కుమారుడు కూడా ఎదురుచూస్తున్నారు తన అభిమాన నటుడితో ఒక్క ఫోటో దిగుతాను అంటూ ఆమె అక్కడ ఉన్న సెక్యూరిటీని ఎంతో వినయంగా రిక్వెస్ట్ చేశారు.
ఇలా జీవితంలో ఒక్కసారి పెళ్లి జరుగుతుందని తన అభిమాన హీరోతో ఒక్క ఫోటో దిగి తాను వెళ్లిపోతానని ఈమె సెక్యూరిటీని ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ సెక్యూరిటీ మాత్రం తనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా వధువు ఎంత బతిమిలాడినా సెక్యూరిటీ ఒప్పుకోకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ అసలు ఆ హీరోతో చివరికి ఫోటో దిగారా లేదా అంటూ కామెంట్లో చేస్తున్నారు. అలాగే మరికొందరు ఎంత స్వీట్గా వధువు రిక్వెస్ట్ చేస్తుంది అంటూ కామెంట్ లు చేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…