Featured

Vishal : పెద్దలు కుదిర్చిన పెళ్లి నాకు సెట్ అవ్వదు… త్వరలో ప్రేమించిన అమ్మాయి పేరు చెబుతా : హీరో విశాల్

Vishal : తమిళ హీరో అయినా తెలుగులో కుడా ఫ్యాన్ బేస్ తో ఉన్న హీరో విశాల్ పందెం కోడి, భరణి, డిటేక్టివ్, ఎనిమీ, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక తమిళంలో సినిమాలతో మంచి గుర్తింపు ఉన్న విశాల్ సినిమా పరిశ్రమ కు ఉన్న సంఘం నడిగర్ రాజకీయాల్లో కూడా అంతే చురుగ్గా ఉంటూ నడిగర్ సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. ఇక నడిగర్ సంఘం ఎన్నికలప్పుడు కల్యాణమండపం కట్టించి మొదట ఆ కల్యాణమండపంలో తానే మొదట పెళ్లి చేసుకుంటా అని విశాల్ మాటిచ్చాడు.

ప్రేమించి పెళ్లి చేసుకుంటా…

ఇక విశాల్ నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్ తో గొడవపెట్టుకున్న విశాల్ ఆయన కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తో డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి చేసుకుంటారని అప్పట్లో బాగా వినిపించినా విశాల్ కు అనిషా అల్లారెడ్డి తో నిశ్చితార్థం జరిపించారు వారి తల్లిదండ్రులు. అయితే కారణాలు తెలియదు కానీ వారి నిశ్చితార్థం రధ్ధయింది. ఇక నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కట్టాల్సిన కల్యాణమండపానికి డబ్బులు లేక, కరోనా లాక్ డౌన్ ఇతర కారణాల వల్ల పనులు ఆగిపోయాయి.

ఇక విశాల్ సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. లాఠీ సినిమా షూటింగ్ లో ఉన్న విశాల్ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేయడంతో గాయాల పాలయ్యారు. కానీ తాజాగా విశాల్ తన పెళ్లి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి తనకు సెట్ అవ్వదని, తానే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. త్వరలో ఆ అమ్మాయి పేరును చెబుతానని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అభిమానులు ఆ అమ్మాయి ఎవరా అని కనుక్కునే పనిలో పడ్డారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

22 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

23 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago