Featured

Vishwak Sen: ‘‘విశ్వక్ పోస్టు చదవగానే నాకు దగ్గొస్తోంది’’.. తరుణ్ భాస్కర్.. విశ్వక్ సేన్ రిప్లై హైలైట్ !

Vishwak Sen-Tharun Bhasker: దేశంలో మరోసారి కరోనా వైరస్ భయాందోళనలను గురిచేస్తోంది. తగ్గినట్లే తగ్గి చాప కింద నీరులో ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. దీంతో సెలెబ్రిటీల దగ్గర నుంచి సామన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మరికి గురి అవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ తో వ్యాప్తి చెందిన ఈ కరోనా కొత్తగా.. ఒమిక్రాన్ లా రూపాంతరం చెంది.. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలా కుతలం చేసేస్తోంది.

ఈ మహమ్మారి ఇండియాలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలతో సహా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అటు బాలీవుడ్ తో పాటు ఇటు దక్షిణాది చిత్రసీమల్లోని కొందరు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విశ్వక్ సేన్ వెల్లడించారు.

Vishwak Sen-Tharun Bhasker: ‘‘ఈ పోస్టు చదవగానే నాకు దగ్గొస్తోంది’’..దర్శకుడు తరుణ్ భాస్కర్ పోస్టు వైరల్..!

అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ ఈ వైరస్‌ సోకడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కు ధరించండి. జాగ్రత్తగా ఉండండి. నాపై మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అని విశ్వక్ సేన్ రాశాడు.

అయితే ఇదే పోస్టును తెలుగు యంగ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు. అతడిని నేను ముడు రోజుల క్రితం కలిశాను అని.. థ్యాంక్స్ రే విశ్వక్.. వాట్ ఏ ఫ్రెండ్ అంటూ పోస్టు టాప్ లో రాసి.. దాని కింద అతడు ఇలా రాశాడు.. ‘‘ఈ పోస్టు చదవగానే దగ్గొస్తుంది నాకు’’ అంటూ రాశాడు. దానికి రిప్లై ఇస్తూ విశ్వక్ సేన్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.. ‘‘అబ్బా సాయిరాం.. ఐ యామ్ సో హ్యాపీ నౌ’’ అంటూ కింద @tharunbhaskar ట్యాగ్ చేశాడు. అయితే ఇదే పోస్టును మళ్లీ.. విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.

స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. అతడు పెళ్లిచూపులు సినిమాకు దర్శకుడిగా పని చేశాడు. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా ‘ఈ నగరానికి ఏమైంది’కి దర్శకత్వం వహించాడు. తర్వాత ఫలక్ నుమా దాస్ లో అతడు నటించాడు. ఇలా విశ్వక్ సేన్ కు.. తరుణ్ భాస్కర్ కి మథ్య స్నేహం ఏర్పడింది. దీంతో వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా.. కలిసే వెళ్తారు. ఇటీవల ఆహాలో మొదలైన గేమ షో లో కూడా కలిసే పాల్గొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago