Featured

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

Rajamouli-Ajith: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా… ఎన్టీఆర్ సరసన ఓలీవియా మోరిస్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ ప్రమోషన్లను ముందుండి నడిపిస్తున్నారు.

Rajamouli-Ajith: కోలీవుడ్ స్టార్ అజిత్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..ఆయన అలాంటి వాడే అంటూ..!

ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చిల్లో ప్రమోషన్లు నిర్వహించారు. ఇటీవల చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తమిళంలో వాలిమైకి పోటీగా RRR రానుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా వాలిమై తెరకెక్కింది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో అజిత్ ప్రస్తావన రాగానే కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజమౌళి.

నాకు ఆశ్చర్యం వేసింది..రాజమౌళి..

ఒకసారి రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుతున్న సమయంలో అజిత్ తో మరిచిపోలేని అనుభవం ఎదురైందని గుర్తు చేసుకున్నారు రాజమౌళి. ఓసారి రామోజీ ఫిలిమ్ సిటీలో భోజనం చేసేందుకు సితార రెస్టారెంట్ వెళ్లానని.. అక్కడే భోజనం చేస్తూ అజిత్ కనిపించారని.. ఎవరో నేను వచ్చానిని చెబితే భోజనం మధ్యలో ఆపేసి నాదగ్గరకు వచ్చి లోపలికి తీసుకెళ్లారని.. అంత పెద్ద స్టార్ ఇలా వ్యవహరించడం నాకు ఇబ్బందిగా అనిపించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. తరువాత నాభార్య రమ వస్తుందని తెలిసి.. తనను తాను పరిచయం చేసుకుని లోపలికి తీసుకెళ్లారని అజిత్ సింప్లిసిటీ గురించి చెప్పుకొచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇంత పెద్ద స్టార్ ఇంత సింపుల్  గా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన అన్నారు.ఇటీవల తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అజిత్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇకపై తన పేరు ముందు ‘తల’ అని పిలవద్దని ఫ్యాన్స్ కు సూచించారు. అజిత్ లేదా ఏకేగా పిలవాలని కోరిన సంగతి మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

13 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

20 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

32 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago