Categories: FeaturedMovie News

Vishwak Sen: వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు.. అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్!

Vishwak Sen: సీనియర్ యాక్టర్ అర్జున్ మీడియా సమావేశంలో భాగంగా హీరో విశ్వక్ సేన్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే అర్జున్ విశ్వక్ గురించి మాట్లాడుతూ తన సినీ కెరియర్లో ఇలాంటి డెడికేషన్ లేని హీరోని చూడలేదనీ, అతను డెడికేషన్ లేని వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే అర్జున్ చేసిన వ్యాఖ్యలపై విశ్వక్ స్పందించారు.

హైదరాబాదులో రాజయోగం సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఈయనకు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే విశ్వక్ మాట్లాడుతూ…నేను చేసిన ప్రతి ఒక్క సినిమాకి నా ఎఫర్ట్స్ పెట్టి చేశాను నావల్ల ఏ నిర్మాతలు కూడా నష్టపోలేదని ముందు ఈయన క్లారిటీ ఇచ్చారు.

ఇక అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ మా మధ్య సరైన అవగాహన లేకుండా పోయింది. ఈ సినిమా కోసం నేను నా వంతు కృషి చేసి సినిమా చేయాలనుకున్నాను. సినిమా చేయనని నేను ఎక్కడా చెప్పలేదు. చాలా ఆలస్యంగా నేను రియలైజ్ అయ్యానని ,వాళ్ల మేనేజర్ ఫోన్ చేసి సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ వెనక్కి పంపించమని చెప్పారు.

Vishwak Sen: సినిమా చేయనని ఎక్కడ చెప్పలేదు…

సెట్ లో తనకు కంఫర్ట్ లేకుండా తాను సినిమా చేయలేనని చెప్పాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసమే తాను మాట్లాడానని అయితే అర్జున్ సార్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం చాలా బాధగా ఉంది అంటూ ఈ సందర్భంగా విశ్వక్ అర్జున్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఈ సినిమా కోసం ఏం చెప్పినా ఏం చేసినా సినిమా మంచిగా రావడం కోసమే చేశానని ఈయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విశ్వక్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago