Vishwak Sen vs Devi Nagavalli issue : ఒక ప్రాంక్ వీడియో ఏకంగా ఒక జర్నలిస్ట్, హీరో మధ్య సోషల్ మీడియా వార్ లా మారింది. సినిమా ప్రచారం కోసం వివాదాస్పదంగా సుసైడ్ ప్రాంక్ తన అభిమానితో చేసిన విశ్వక్ సేన్ ఇక ఆ ప్రాంక్ తో విమర్శల పాలైన విశ్వక్ ఇక ఆ తరువాత ఈ విషయం మరో మలుపు తిరిగి ఈ ప్రాంక్ వివాదాన్ని కాస్త డిబేట్ పెట్టి మరి రచ్చ చేసారు tv9 వాళ్లు. ఇక తనను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అని ఏకంగా టీవీ 9స్టూడియో కి వెళ్లి డిబేట్ లో కూర్చున్నాడు విశ్వక్. ఇక తనను పాగల్ సేన్ అని డిప్రెస్డ్ పర్సన్ అని వ్యక్తిగతంగా అనొద్దని విశ్వక్ అనగా దేవి నాగవల్లి గెట్ అవుట్ అనడం ఇక ఆ తరువాత విశ్వక్ ఎఫ్ పదం వాడడం అన్ని వివాదాన్ని పెద్దది చేసాయి.
సోషల్ మీడియా పోస్టులతో వార్….
ఇక ఒక మహిళను ఎంత కోపం వచ్చిన అలాంటి అసభ్య కరమైన మాట మాట్లాడటం తప్పు అంటూ మహిళలు సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ఘాటు గా మాట్లాడాయి. ఇక ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీ నుండి కొంతమంది విశ్వక్ కు మద్దతుగా నిలబడ్డారు నెటిజన్స్ సైతం టీవీ 9 ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇపుడు సినిమా ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కూడా విశ్వక్ కు మద్దతు పలికింది. ఇక అక్కడితో ఆగకుండా ఈ వివాదంలోకి యాంకర్ అనసూయను లాగింది.
అనసూయ ఎఫ్ పదం వాడినపుడు ఎక్కడికి పోయావు…..
కరాటే కళ్యాణి టీవీ 9, సేన్ గొడవలో ఛానెల్ దే తప్పని భావిస్తున్నాను. విశ్వక్ సేన్ ఎఫ్ పదం వాడడం తప్పైతే మరి అనసూయ కూడా ఆ పదం వాడింది కదా మరి తనను ఫైటర్ అని అన్నావ్ అపుడు ఏమి చేసావ్ రోడ్డు మీద డాన్స్ చేస్తున్నావా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక ఇదే ఇష్యూ మీద బాబు గోగినేని స్పందిస్తూ అనసూయ ఎఫ్ పదం వాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే అదే టీవీ 9స్టూడియో అదే దేవి ముందు అనసూయ ఎఫ్ పదం వాడింది మరి. అటు ఇటుగా పాపం ఈ వివాదంలోకి అనసూయను లాగేశారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…