Kajal Agarwal : కాజల్ అగర్వాల్ 2007 వ సంవత్సరంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. తర్వాత వచ్చిన చందమామ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తన కాథా లో వేసుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చలామణి అయింది. కాజల్ అగర్వాల్ దాదాపుగా టాలీవుడ్ లో అందరు హీరోలతోనూ నటించింది. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని ప్రేమ వివాహం చేసుకుంది.
పెళ్లి అయ్యాక కూడా సినిమాలు కంటిన్యూ చేస్తాను అని చెప్పిన కాజల్ అదే మాటగా పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు వెబ్ సిరీస్ ల లో నటించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరం అయిన కాజల్ అగర్వాల్ తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికి తన బిడ్డకు కేటాయిస్తోంది. ఇటీవలే తన పుట్టిన బిడ్డను నీల్ కిచ్లు గా అభిమానులకు పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కు సంబంధించి అభిమానులలో ఒక అనుమానం కలుగుతోంది.
కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరం కానుందా…..
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన బిడ్డ నీల్ కిచ్లు తో మాతృత్వాన్ని ఆనందిస్తోంది.అయితే కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరం కాబోతుంది అని సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నీల్ కిచ్లు ఇంకా చిన్నవాడు అవ్వడం కారణంగా కాజల్ అగర్వాల్ మెల్లగా సినిమాలకు దూరం కావాలని ఆలోచిస్తోందట. ఈ విషయంలో గౌతం కిచ్లు కూడా కాజల్ నిర్ణయాన్ని సమర్పిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కాజల్ కూడా ఇదే బాటలో నడుస్తుందా అన్న అనుమానాలు అభిమానులలో మొదలవుతున్నాయి. అయితే కాజల్ సినిమాలో నటించడం పై వస్తున్న ఈ వార్తలపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…