అమ్మతనం ఎంతో అపురూపమైనది. అలాంటి అమ్మే తన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తే ఆ బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. తాజాగా విశాఖలో ఓ కన్న తల్లి తన బిడ్డను అమ్ముకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖ గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. నెలలు నిండిన తర్వాత ఏప్రిల్ 19న ఆ యువతి కేజీహెచ్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ యువతికి పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమెలో భయం వెంటాడింది.కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండడంతో తన బిడ్డ పోషణ బరువవుతుందని భావించిన ఆ యువతి ఆసుపత్రిలోనే తన బిడ్డను ఇతరులకు అమ్మేసింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళగానే తన గర్భం గురించి, ప్రసవం గురించి ఇరుగు-పొరుగు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
ఇరుగు పొరుగు వారు అడిగే ప్రశ్నలకు తన బిడ్డ మరణంతో పుట్టాడని అబద్ధం చెప్పింది. ఈ విషయం కాస్తా ఐసీడీఎస్ అధికారిణికి తెలియడంతో ఆమెను పిలిపించి ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారికి ఆ యువతి పై అనుమానాలు కలిగాయి. దీంతో ఐసీడీఎస్ అధికారిణి నిజం చెప్పాలి లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆ మహిళ జరిగిన విషయం బయటపెట్టింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల తన బిడ్డను ఆస్పత్రిలోనే ఇతరులకు అమ్మినట్లు అసలు విషయం బయట పెట్టడంతో అమ్మిన ఆ బిడ్డను తిరిగి తీసుకొచ్చారు. ఐసీడీఎస్ అధికారిణి, వాలంటీర్, మహిళా కానిస్టేబుల్ శిశువును మర్రిపాలెంలోని ప్రభుత్వ శిశు గృహానికి శనివారం అప్పగించారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…