పెళ్లి కాకుండానే తల్లయ్యింది.. చివరికి దారుణమైన పని?

0
110

అమ్మతనం ఎంతో అపురూపమైనది. అలాంటి అమ్మే తన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తే ఆ బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. తాజాగా విశాఖలో ఓ కన్న తల్లి తన బిడ్డను అమ్ముకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖ గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. నెలలు నిండిన తర్వాత ఏప్రిల్ 19న ఆ యువతి కేజీహెచ్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ యువతికి పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమెలో భయం వెంటాడింది.కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండడంతో తన బిడ్డ పోషణ బరువవుతుందని భావించిన ఆ యువతి ఆసుపత్రిలోనే తన బిడ్డను ఇతరులకు అమ్మేసింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళగానే తన గర్భం గురించి, ప్రసవం గురించి ఇరుగు-పొరుగు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

ఇరుగు పొరుగు వారు అడిగే ప్రశ్నలకు తన బిడ్డ మరణంతో పుట్టాడని అబద్ధం చెప్పింది. ఈ విషయం కాస్తా ఐసీడీఎస్‌ అధికారిణికి తెలియడంతో ఆమెను పిలిపించి ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారికి ఆ యువతి పై అనుమానాలు కలిగాయి. దీంతో ఐసీడీఎస్‌ అధికారిణి నిజం చెప్పాలి లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆ మహిళ జరిగిన విషయం బయటపెట్టింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల తన బిడ్డను ఆస్పత్రిలోనే ఇతరులకు అమ్మినట్లు అసలు విషయం బయట పెట్టడంతో అమ్మిన ఆ బిడ్డను తిరిగి తీసుకొచ్చారు. ఐసీడీఎస్‌ అధికారిణి, వాలంటీర్, మహిళా కానిస్టేబుల్‌ శిశువును మర్రిపాలెంలోని ప్రభుత్వ శిశు గృహానికి శనివారం అప్పగించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here