Featured

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గెలిచిందెవరు..? బీఆర్ఎస్సా.. వైసీపీనా..? టీడీపీ సౌండ్ చేయలేదేం.. బాబోయ్ సాయంత్రానికే స్వరం మారిపోయిందేం..!

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం సృష్టిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడే ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదని ప్రకటించేశారు. అర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్) బలోపేతానికి మాత్రమే కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేశామన్నారు. కులస్తే వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలిగించాయి. అంతా బాగానే ఉంది కదా. మరి పెను దుమారం అన్నారేంటి అనుకుంటున్నారా? మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ క్రెడిట్ ఎవరి దక్కాలి? ఇదే ఇప్పుడు పార్టీల మధ్య మాటల యుద్ధానికి లేటెస్ట్ కారణం.

మీరు మీరు కొట్టుకోండి..

లేటెస్ట్ కారణమేంటా? అని ఆశ్చర్యపోకండి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతలు స్టీల్ ప్లాంట్ విషయంలో మాటల యుద్ధానికి దిగాయి. ఇక ప్రైవేటీకరణ ఆగిపోవడంతో ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇక ఈ విషయంలో లేటెస్ట్‌గా తిరిగి మాటల యుద్ధానికి దిగాయి. వైసీపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ చుట్టూ తిరుగుతున్నాయి. మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయ్యింది. ఇక టీడీపీ మాత్రం మీరు మీరు కొట్టుకోండి.. నన్ను ఎంటర్‌టైన్ చేయండి అన్నట్టుగా పరిణామాలన్నింటినీ చూస్తోంది. కేసీఆర్ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్… తాము కేంద్రాన్ని పునరాలోచించడం వల్లే ఈ పరిణామమని వైసీపీ చెప్పుకుంటోంది. జనసేనాని ఏమైనా తక్కువ తిన్నారా? తామే వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి సూచించామని తెలిపారు. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

తూచ్.. నేనలా అనలే..

మొత్తానికి పార్టీలు స్టీల్ ప్లాంట్ క్రెడిట్‌ను ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే షాక్ ఇచ్చారు. తూచ్ నేనలా అనలేదు అంటూ మరో ప్రకటన చేశారు. అంతే తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా నివ్వెరబోయాయి. అంతకు ముందు కులస్తే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ పోరాటం కారణంగానే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని తెలిపారు. తెగించి పోరాడామని.. కేసీఆర్ దెబ్బ ఇలాగే ఉంటుందంటూ కాస్త రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశారు. కేటీఆర్‌కు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సైతం జతయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే కేంద్రంలో మార్పు వచ్చిందని ఆయన కూడా పేర్కొన్నారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు.

ప్రైవేటీకరణపై బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశాం..

ఫగ్గన్ సింగ్ కులస్తే అంతకు ముందు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం స్వాగతించారు. ప్రజల సెంటిమెంట్ అయిన ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకూడదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశామని.. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచి భారీ బహిరంగ సభ నిర్వహించిన అంశాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. అఖిల పక్షం సాయంతో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని కోరినా కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదన్నారు. విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందించిన మాదిరిగా వైసీపీ స్పందించలేదన్నారు. రాజకీయ ప్రయోజనాలతో విమర్శలు తప్ప.. పరిశ్రమను కాపాడతామన్న మాట మాత్రం ఏపీ ప్రభుత్వం నోటి వెంట రాలేదని పవన్ విమర్శించారు.

సాయంత్రానికి మాట మారింది..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే సాయంత్రానికి మాట మార్చేశారు. ఈ అంశం కేంద్ర కేబినెట్ పరిధిలో ఉంటుందని.. తన వ్యాఖ్యలను వక్రీకరించిందని మీడియాపై నిందలేశారు. గురువారం సాయంత్రం నోవాటెల్ హోటల్‌లో కేంద్రమంత్రిని కలిసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి నాయకులు వెళ్లారు. ప్రైవేటీకరణ ఉండదనే వ్యాఖ్యలు చేశారు కాబట్టి ధన్యవాదాలు చెప్పుకుందామని వెళితే.. కేంద్ర మంత్రి పెద్ద బాంబే పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తన పరిధిలోది కాదని పేర్కొన్నారు. పాలసీ మేటర్ కాబట్టి ఇది కేబినెట్‌కి సంబంధించిన అంశమని.. ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్‌‌ మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఎంతో ఉత్సాహంగా కేంద్రమంత్రిని కలిసేందుకు వెళ్లిన నేతలు ఉసూరు మంటూ వెనుదిరిగారు. క్రెడిట్ ఖాతాలో వేసుకునేందుకు పోటీ పడిన నేతలంతా గప్ చుప్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago