Featured

Senior producer Tammareddy Bhardwaja : చిన్న హీరోల ఆటిట్యూడ్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి…: సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ

Senior producer Tammareddy Bhardwaja : తెలుగు సీనియర్ నిర్మాత మరియు దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరుంది. తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా డైరెక్టర్ గా మంచి సినిమాలను తీసారు. ఇక తమ్మారెడ్డి అనగానే కృష్ణ గారితో తీసిన ‘పచ్చని సంసారం’ సినిమా గుర్తొస్తుంది. చిరంజీవి ‘కోతలరాయుడు’ సినిమాతో నిర్మాతగా మారిన తమ్మారెడ్డి ‘పోతే పోనీ’ లాంటి సామాజిక అంశాలతో కూడిన సినిమా కూడా చేసారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు వచ్చింది. ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

చిన్నహీరోలు ఆటిట్యూడ్ చూపించకపోతే మంచిది…

ఈ మధ్య కాలంలో విడుదల అయిన చిన్న సినిమా ‘బలగం’ పెద్ధ హిట్ అవడం గురించి తమ్మారెడ్డి భారద్వాజ గారు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రొడక్షన్, హీరో అనే విషయాలు కాకుండా కంటెంట్ ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటూ తెలిపారు. ఇక చిన్న సినిమాల హీరోల గురించి మాట్లాడుతూ చిన్న హీరోలు వారి సినిమాలకు ప్రమోషన్ చేసుకోవడం తప్పు కాదు అయితే సినిమా సూపర్ గా ఉంది చించేసా అరేసా అంటూ కబుర్లు చెప్పాల్సిన పని లేదు.

నచ్చితే ఆదరించండి అని ప్రేక్షకులను కోరితే చాలు అంటూ చెప్పారు. పెద్ధ హీరో అయినా చిన్న హీరో అయినా ప్రేక్షకులను సినిమా చూడమని అడగాల్సిందే కానీ ఆర్డర్ వేయకూడదు అంటూ ఆ తత్వం కొంతమంది చిన్న హీరోలకు ఇంకా బోధపడలేదు అంటూ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…

6 minutes ago

ఫ్రెష్ మటన్ ఎలా గుర్తించాలి?.. తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్!

వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…

12 minutes ago

ట్రోలింగ్‌ను జయించి టాప్ మార్కులు.. ప్రాచీ నిగమ్ స్ఫూర్తిదాయక గాథ

ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాచి…

1 hour ago

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. వ్యూహమా? సంకోచమా?

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…

1 hour ago

లక్నో జట్టులో కలకలం.. పంత్ కెప్టెన్సీపై జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…

1 hour ago

రక్తహీనతతో బాధపడుతున్నారా?.. ఈ డైట్ ఫాలో అయితే హీమోగ్లోబిన్ పెరుగుతుంది!

నేటి కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరంలో హీమోగ్లోబిన్…

2 hours ago