Actor Sudhakar Komakula : 2012లో విడుదల అయిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుధాకర్ కోమాకుల. అయితే అంతకంటే కొన్ని సినిమాల్లో నటించిన సుధాకర్ స్వస్థలం వైజాగ్ కాగా డాన్స్గ్రూప్ లో మెంబెర్ గా ఉంటూ సినిమాల వైపు వచ్చాడు. ‘మనసు’ అనే సినిమాతో పరిచయమైనా ‘ఒక వి చిత్రమ్’ సినిమాలోనూ నటించాడు. అయితే ఆ సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తరువాత కుడా కుందనపు బొమ్మ, హ్యాంగ్ అప్, నువ్వు తోపురా, ఉందిలే మంచి కాలం ముందు ముందునా వంటి సినిమాలను చేసినా అవి నిరాశ పరిచాయి. అయితే కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారినవి కూడా తన కెరీర్ లో ఉండగా అలాంటి ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
టాక్సీవాలా నేను చేయాల్సింది…
సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరువాత మంచి పేరు గుర్తింపు వచ్చినా అవకాశాలు వచ్చినా కెరీర్ ఇంకా స్థిరపడలేదు. మధ్యలో గ్యాప్ తీసుకోవడం మంచి కథలను ఎంపిక చేసుకున్నా ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోవడం వల్ల ఆగిపోయాయి అంటూ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఎదగాలంటే ఓపిక, అదృష్టం అన్నీ ఉండాలని తెలిపారు. ఆయన ఊహలు గుస గుసలాడే, నీది నాది ఒకే కథ వంటి సినిమాల్లో నటించాల్సి ఉన్నా అవకాశం మిస్ అయిందట.
ఇక విజయ దేవరకొండ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిన ‘టాక్సీవాలా’ కూడా తనకి ఎపుడో డైరెక్సటర్ కథ చెప్పాడని, చేద్దామని అనుకున్నాక ప్రొడ్యూసర్స్ దొరికాక హీరో మారిపోయాడని తెలిపారు. ఇప్పటికీ టాక్సీవాలా నేను చెయ్యాల్సిన సినిమా అని విజయ్ దేవరకొండకి తెలియదు అంటూ తెలిపారు సుధాకర్. చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఇద్దరం డిస్కస్ చేస్తాం కానీ పోయిన వాటి గురించి మాట్లాడుకోము అంటూ సుధాకర్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…