Categories: FeaturedMovie News

Heroine Prema : భర్తతో విడాకులకు కారణం… పిల్లలు లేరు… క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కి వెళ్ళా… రెండో పెళ్లి ఎప్పుడంటే…: హీరోయిన్ ప్రేమ

Heroine Prema : దేవి సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రేమ, ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగమ్మాయి అనే ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చాక తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రామన్న చౌదరి అలాగే ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుత తెలుగులో నటించడం లేదు. ఇక బెంగళూరులో నివాసముంటున్న ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.

వ్యక్తిగత జీవితం గురించి ప్రేమ…

ప్రేమ కెరీర్ బాగా ఉన్నపుడే పెళ్లి చేసుకున్నా మనస్పర్తల కారణంగా చాలా త్వరగానే విడిపోయారు. ఈ విషయాలను ఎప్పుడు మీడియాతో పంచుకోని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్రం మొదటి సారి వాటి గురించి మాట్లాడారు. నచ్చక, ఇబ్బంది పడుతూ బ్రతకడంకంటే విడిపోవడం మేలు అనిపించింది. అదీ కాక కుటుంబం నాకు సపోర్ట్ గా నిలవడం నాకు మరింత ధైర్యం ఇచ్చింది. నేనే స్వయంగా కోర్ట్ కి హాజరై, నా పేరెంట్స్ వస్తామని చెప్పినా వద్దని చెప్పి వెళ్లి విడాకులు తీసుకుని వచ్చాను. మళ్ళీ పెళ్లి గురించి ఆలోచన లేదు.

ఒకవేళ చేసుకోవాలని అనిపిస్తే ఖచ్చితంగా నాకు డెబ్భై ఏళ్ళు వచ్చిన తరువాత చేసుకుంటా అంటూ తెలిపారు అందులో తప్పు లేదంటూ చెప్పారు. ఇక గతంలో తనకు కాన్సర్ అంటూ వచ్చిన వార్తల గురించి మాట్లాడుతూ స్నేహితుల వద్ద ఉండటానికి న్యూ జిలాండ్, ఆస్ట్రేలియా వెళితే నాకేదో క్యాన్సర్ సోకిందని ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళానంటూ ఏవేవో కథనాలు రాసేసారు. అలాంటి వాటికి బాధపడే స్టేజి దాటేశాను, అలాంటి వాటిని పట్టించుకోలేదు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago