Balagam fame Lalitha : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికి కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా సినిమాలో హీరో పిన్నిగా గయ్యాళి పాత్రలో నటించిన లలిత చిరంజీవి గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ గురించి మాట్లాడారు.
సెల్ఫీ అడుగుతుంటే ఆనందంగా ఉంది…
లలిత గారు సురభి నాటక మండలి నుండి వచ్చిన కళాకారిణి, ఆమె ఎన్నో సోషల్ నాటకాలు వేయడం వల్ల నటించడం కష్టం కాలేదు. ఇక బలగం సినిమాలో సెలెక్ట్ అయ్యాక కూడా సినిమాలో నా పాత్ర ఎడిటింగ్ లో పోతుందేమో ఆశలు పెట్టుకోకూడదు అనుకునే దాన్ని సినిమా విడుదల అయ్యాక కూడా చిన్న సినిమా నాలుగు రోజులు థియేటర్స్ లో ఆడుతుంది అంతే అనుకున్నాం. కానీ ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని అనుకోలేదు అంటూ చెప్పారు లలిత.
ఇక ఎపుడైనా సెలబ్రిటీ వద్దకు వెళ్లి సెల్ఫీ అడగాలంటే భయం ఉండేదని, వాళ్ళు కాసురుకుంటారేమో అని అనిపించేది కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చాలా మంది సెల్ఫీ అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది, ఇలాంటి రోజుకు మనం వెళ్ళగలమా అనుకున్నా చివరకు అలాంటి రోజు వచ్చేసింది అంటూ ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లలోనూ అలాగే సినిమాల్లోనూ నటిస్తున్నట్లు తెలిపారు లలిత.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…