Heroine Prema : ‘దేవి’ సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రేమ ‘ధర్మచక్రం’ సినిమాలో వెంకటేష్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయిna తెలుగమ్మాయి అనే ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ కస్తూరి. ఇక ఆమె సినిమాల్లోకి వచ్చాక తెలుగు మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రామన్న చౌదరి అలాగే ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుత తెలుగులో నటించడం లేదు. ఇక బెంగళూరులో నివాసముంటున్న ఆమె తన ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.
ఆస్తులు ఎన్ని ఉన్నాయంటే…
ప్రేమ గారు ఒకవైపు తెలుగులో మంచి పేరు సంపాదించుకుంటూనే మాతృ భాష కన్నడ లోనూ అందరు అగ్ర హీరోలతోనూ సూపర్ హిట్స్ లో నటించింది. అలాగే తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటించిన ప్రేమ అప్పట్లో డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మంచి రెమ్యూనరేషన్స్ అందుకున్నారు. అలా మంచి ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే ప్రేమ మాత్రం సింపుల్ గా ఒకప్పటి అగ్ర హీరోయిన్ అని స్టేటస్ ఏమాత్రం చూపించకుండా సాధారణంగా ఉన్నారు.
ఆస్తుల కంటే గౌరవం సంపాదించుకోవడం ముఖ్యం అని తనకు ఆస్తి చాలా ఉందని వివరించారు ప్రేమ. ఇక తాను హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న సమయంలో కన్నడ హీరో ఉపేంద్ర తో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వినిపించిన వార్తల మీద స్పందించిన ప్రేమ అవన్నీ ఒట్టి పుకార్లేనని, రాసిన వారినే అడగాలంటూ చెప్పారు. మా ఇద్దరికీ అంత క్లోజ్ రిలేషన్ కూడా ఏమి లేదు, ఎపుడూ బయట కలిసింది కూడా లేదు కానీ అలాంటి రూమర్స్ వస్తుంటాయి. వాటిని నేను అసలు పట్టించుకోను అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…