Vizag Swetha suicide Case : తండ్రి లేడు, తల్లే అల్లారుముద్దుగా పెంచింది. బాగా కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న శ్వేత కలలు పెళ్లితోనే ఆగిపోయాయి. పెళ్లయ్యాక చదువుకోడానికి ఒప్పుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళయ్యాక ఆ ఊసే ఎత్తలేదు. వావి వరసలు లేకుండా చెల్లి వరస అయ్యే శ్వేతతో ఆడపడుచు భర్త అసభ్యంగా ప్రవర్తించినా అత్తింటి వారు పట్టించుకోక పోగా తప్పు నీదేనని క్షమాపణ చెప్పించడంతో భరించలేక గర్భంతో ఉన్న తాను వైజాగ్ సముద్ర తీరాన శవమై కనిపించింది. అయితే ఆమె మరణం అనుమానస్పద మరణంగా కేసు నమోదు చేసారు పోలీసులు. శ్వేతది ఆత్మహత్య కాదని హత్య అని ఆమె తల్లి ఆరోపిస్తోంది. శ్వేత తల్లి ఆమె కూతురు మరణంతో అత్తింటి వారి మీద కేసు పెట్టింది.
నలుగురిని రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు…
శ్వేత పెళ్లి జరిగిన కొద్ది నెలలు బాగానే ఉన్నా ఆ తరువాత అత్తింటి అరాచకాలు మొదలయ్యాయి. అత్త, ఆడపడుచు ఆమెను మాటలతో వేధించడం, కట్నం ఇంకా ఎక్కువ వచ్చే కోడలు వచ్చేందంటూ మాట్లాడటం ఇవన్నీ ఒకెత్తయితే శ్వేత ఆడపడుచు భర్త వరుసకు అన్న అయ్యే సత్యం ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇదే విషయం అత్త, ఆడపడుచు వద్ద చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా తప్పు శ్వేతదే అన్నట్లుగా ఆమెను క్షమాపణ చెప్పాల్సిందిగా ఆర్డర్ వేసి ఆమెతో సారీ చెప్పించారు.
ఇంత జరుగుతున్నా భర్త ఏమి పట్టించికోకపోవడంతో ఒంటరి అయిన శ్వేత గత మంగళవారం వారం కనిపించకుండా పోయింది. ఆ తరువాత విశాఖపట్నం సముద్ర తీరంలో శవమై కనిపించింది. ఆమె రాసిన లెటర్ లో వెళ్లిపోతున్నా అని రాయడం, ఆమె బట్టలు ఒక చోట దొరకడం వల్ల ఆత్మహత్య అని భావించినా ఆమె అప్పటికే ఐదు నెలలు గర్భవతి కావడం, ఆమె ఆత్మహత్య చేసుకోలేదు చంపారు అంటూ శ్వేత తల్లి ఆరోపించడం, పోలీసులకు శ్వేత అత్తింటి వారి మీద ఫిర్యాదు చేయగా ప్రస్తుతం శ్వేత భర్త, అత్త, మామతో పాటు ఆడపడుచు భర్త సత్యం లను రిమాండ్ కు తరలించారు పోలీసులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…