Vizag Swetha suicide Case : తండ్రి లేడు తల్లే అల్లారుముద్దుగా పెంచింది. బాగా కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న శ్వేత కలలు పెళ్లితోనే ఆగిపోయాయి. పెళ్లయ్యాక చదువుకోడానికి ఒప్పుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళయ్యాక ఆ ఊసే ఎత్తలేదు. వావి వరసలు లేకుండా చెల్లి వరస అయ్యే శ్వేతతో ఆడపడుచు భర్త అసభ్యంగా ప్రవర్తించిన అత్తింటి వారు పట్టించుకోక పోగా తప్పు నీదేనని క్షమాపణ చెప్పించడంతో భరించలేక గర్భంతో ఉన్న తాను వైజాగ్ సముద్ర తీరాన శవమై కనిపించింది. ఆత్మహత్య లేక హత్య అని తెలియని ఈ కేసులో శ్వేత పుట్టింటి వద్ద ఎలా ఉండేది తన అత్తింటి వాళ్ళు ఎలా ప్రవర్తించారు లాంటి విషయాలను అక్కడి ఇరుగు పొరుగు వివరించారు.
అత్తింటి వేధింపులే మరణానికి కారణం….
శ్వేత తన తల్లితో పాటు విశాఖలో నివాసముండేది. ఆరు ఏళ్లుగా అక్కడే ఉంటున్నారని వాళ్ళు ఏరోజు ఉన్నట్లుగా కూడా తెలిసేది కాదని శ్వేత తల్లి కాస్త మాట్లాడేది కానీ శ్వేత ఎపుడు మాట్లాడేది కానీ తన కోసం స్నేహితులు రావడం, తను బయటికి వెళ్లడం చూడలేదని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్న మాట. ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఉండేది అలాంటి అమ్మాయి పెళ్లి అయ్యాక వాళ్ళ అత్తింటి వాళ్ళు బాగా వేధించారు.
ఆ అమ్మాయి గత మంగళ వారం నాడు కనిపించకపోవడంతో శ్వేత తల్లి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవ చేసారు. శ్వేత ఎవరితోనో లేచి పోయిందని నానా రబస చేసారు. లేచి పోయిన అమ్మాయి ఎలా చనిపోయి శవమై వచ్చింది. వాళ్ళు బాగా హింసించారు ఆవి భరించలేక ఆ అమ్మాయి మరణించింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఆ అమ్మాయిని చూస్తామని అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…