Senior artist Lathasree : యమలీల సినిమా అనగానే హిమ క్రీములు అంటూ వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. అందులో యమ ధర్మ రాజైన కైకాల గారితో ఆడిపాడి ఐస్ క్రీములను తినిపించే పాత్రలో నటించిన లత శ్రీ అన్నా సరే వెంటనే తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అప్పట్లో హీరోలందరికీ చెల్లిగా నటించి స్టార్ చిట్టి చెల్లెలు అయిన లతాశ్రీ 1999 తరువాత సినిమాల్లో నటించడం మానేసింది, లవ్ మ్యారేజ్ చేసుకుని స్థిరపడ్డారు. మళ్ళీ చాలా ఏళ్లకు అత్తిలి సత్తిబాబు సినిమాలో నటించిన ఆమె సినిమాల్లో కనిపించలేదు. ఇక సినిమాల గురించే కాకుండా తన ఫ్యామిలీ గురించి చెబుతూ లతాశ్రీ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు.
నాగశౌర్య నా అల్లుడే… కానీ చెప్పుకోను…
ఊహలు గుస గుస లాడే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగ శౌర్య సొంత బ్యానర్ పెట్టి తల్లి ఉష ముల్పూరి నిర్మాణంలో సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే నాగశౌర్య తండ్రి శంకర్ ముల్పూరి గారు లత శ్రీ గారికి సొంత అన్న. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కానీ ఎపుడూ నాగశౌర్య కుటుంబం ఈ విషయం ప్రస్థావించలేదు. ఇక ఇదే విషయాన్ని లతాశ్రీ గారిని అడిగినపుడు వాళ్ళు చెప్పుకోవడం లేదు నాకు అవసరం లేదు. నా గుర్తింపు నాకుంది వాళ్ళు పేరు చెప్పాల్సిన పని లేదు.
నాకు తోబుట్టువులు ఉన్నారా అన్న ప్రశ్న ఎదురైనపుడు అన్న ఉన్నాడని చెబుతాను. అన్న మనవాడే, మేనల్లుడు మనవాడే కానీ వదిన కాదు కదా అంటూ ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదని తెలిపారు. ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ బి టెక్, ఇంటర్ చదువుతున్న ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ప్రేమ వివాహం అని జిమ్ ట్రైనర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పిన లతాశ్రీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసీ మా అమ్మ కొట్టిందని తెలిపారు. ఇక తన భర్త నార్త్ ఇండియన్ అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…