Categories: FeaturedMovie News

వాచ్ మెన్ స్ధాయి నుండి గ్రేట్ విలన్ గా ఎదిగిన రియల్ హీరో సక్సెస్ స్టోరీ !!

సినిమాలలో హీరో విలన్ ని కొడుతూ ఉంటే అది చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రియల్ లైఫ్ లో విలన్ లే ఎక్కువగా మంచి పనులు చేస్తుంటారు. అందుకు నిజమైన ఉదాహరణ మన టాలీవుడ్ విలన్ షియాజీ షిండే. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అందర్నీ ఆకటుక్కున షియాజీ ఇప్పుడు నిజంగా సూపర్ హీరో అయ్యాడు.

ఆ మధ్య మహారాష్ట్రలోని పుణే శివార్లలో ఉన్న కాట్‌రాజ్ ఘాట్ రోడ్డులో కారులో వెళ్తుండగా అడవి తగలబడటం చూసి‌ వెంటనే కారు ఆపి రంగంలోకి మంటలను ఆర్పి అడవి తగలబడకుండా చూశారు. ఈ మధ్యకాలంలో కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో కూడా మన ప్రకృతిని మపమే రక్షించుకుందామనే కాన్సెప్ట్ తో అందర్నీ మొక్కలు నాటమని గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.! షాయాజీ రియల్ హీరోయిజానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.?! ఇక వృత్తిపరంగా చూస్తే.. షాయాజీ షిండే మాత్రం తన నటనలో చిన్న తప్పు కూడా లేకుండా వెండితెరపై రాక్షసత్వాన్ని పండించి ‘సూపర్ విలన్’ అనిపించుకోగలరు.

‘ఠాగూర్’ చిత్రంలో ‘బద్రీనారాయణ’ పాత్రతో తెలుగు చలన చిత్రసీమకు విలన్ గా పరిచయమైన షాయాజీ ‘వీడే’ సినిమాలో బత్తుల బైరాగి నాయుడుగా అదరగొట్టేశాడంటే అతిశయోక్తి కాదు. అతని విలనిజానికి ఈ రెండు ఉదాహరణలు చాలు.. అతనెంత గొప్ప నటుడో చెప్పడానికి..! సొంత గొంతు కన్నా.. అరువు గొంతుతో మరింత ఎక్కువగా భయపెట్టగలడనేది ‘వీడే’ సినిమాతో రుజువు చేసినా… ఆయన తన సొంత గొంతుతోనే డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను ఎక్కువగా భయపడడం ఆయనకిష్టం.

ఇక ఆ కళ్లలో పలికే భావాలు చాలు.. నిజంగా విలన్ అంటే ఎలా వుండాలో చెప్పడానికి.! తెలుగు ప్రేక్షకులందరికీ ‘షాయాజీ మన విలనే’ అన్నంత ఆత్మీయంగా దగ్గరైన షాయాజీ షిండే వాస్తవానికి మరాఠీ నటుడంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇక షాయాజీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. ఊహించని విషయాలే కళ్ళముందు కదలాడి షాక్ కి గురిచేస్తాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన షాయాజీ షిండే డిగ్రీ తరువాత ‘మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్’లో వాచ్‌మెన్‌గా చేరారు. ఆరోజుల్లో నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా సరే అతని మనసంతా నాటకాలపైనే ఉండేది. ‘నేను నటుడిని కాగలనా?’ అని మనసులో ఎప్పుడూ అదే ప్రశ్న అతనిడిని వేధిస్తూ వుండేది..

‘నటుడు కావాలంటే ఏంచేయాలి?’ అనేది మరో ప్రశ్న. ఇక ఇలా కాలయాపన చేయడం కరెక్ట్ కాదని భావించిన షాయాజీ ‘మంచి నటుడు కావాలంటే ఏంచేయాలి?’ అని ఒక పెద్దాయనను అడిగినప్పుడు..
 ‘మందుకొట్టే అలవాటు ఉందా?’  ‘సిగరెట్ తాగే అలవాటు ఉందా?’ అని అడిగాడు.  ‘అప్పుడప్పుడు తాగుతాను’ అని జవాబు ఇచ్చారు షిండే. ‘‘చెడు అలవాట్లేమీ లేకుంటేనే మంచి నటుడివి కాగలవు’ అని విలువైన సలహా ఇచ్చాడు ఆ పెద్దాయన. ఇక అప్పటి నుంచి…‘శరీరంపై శ్రద్ధ చూపాలి. యోగా చేయాలి’  ‘కొత్త జీవితం మొదలు పెట్టాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నారు షిండే. అక్కడితో ఆగకుండా.. ‘నటన’ గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా తనకు తెలిసినవాళ్ళందరితోనూ మాట్లాడేవాడు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివేవాడు. దాదర్‌ రైల్వే స్టేషన్ లో ఒక పుస్తకాల దుకాణంలో కనిపించిన భరతముని ‘నాట్యశాస్త్ర’ పుస్తకాన్ని కూడా క్షుణ్ణంగా చదివేశాడు. ‘అభినయ సాధన్’లాంటి మరాఠీ పుస్తకాల నుంచి నోట్స్ తయారు చేసుకునేవాడు. ఇదంతా చోద్యం చూసినట్టు చూసిన ఇంట్లో వాళ్లు మాత్రం.. ‘వీడికేమైనా పిచ్చా’ అనుకునేవాళ్లు. 

‘ధార్మియ’ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు అప్పట్లోనే ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ పాత్రకు స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు చాలామంది. ఈ హిజ్రా పాత్రతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘భారతి’ అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రమణ్య భారతిగా నటించి దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు. అలా అలా ఇంతింతై వటుడింతై అన్న చంధాన నేడు గ్రేట్ విలన్ గా టాలీవుడ్ ను ఏలుతున్నాడు. రియల్లీ హాట్సాఫ్ టూ షాయాజీ షిండే..!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago