General News

అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టుకుపోయిన స్కూటీ.. వీడియో వైరల్!

ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది డంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం కావడంతో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. అయితే ఈ విధంగా వాహనాలు కొట్టుకుపోవడంలో వింత ఏమి లేదని చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో మాత్రం ఒక స్కూటీ కింద పడకుండా ఏదో ఆత్మ స్కూటీ నడుపుతున్నట్లు వెనక్కి వెళ్లడం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ముంబైలో అధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే వరద నీటి ప్రవాహం ఇండ్లలోకి షాపుల లోకి రావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో చించ్‌పోక్లీ ఏరియాలో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలని నీటిలో కొట్టుకు పోయాయి.

స్థానికులు చూస్తుండగానే స్కూటీ వరదనీటిలో కింద పడకుండా స్కూటీ అలా వెనక్కి వెళుతూ ఉండటం చూసిన స్థానికులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ.. బండిపై మనిషి లేకుండా స్కూటీ అలా కదులుతూ వెనక్కి వెళ్లడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్లు చేయగా.. మరి కొందరు ఏదైనా ఆత్మ బండి నడుపుతూ ఉందా..అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అచ్చం సినిమా గ్రాఫిక్స్ ను తలపిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago