ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది డంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం కావడంతో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. అయితే ఈ విధంగా వాహనాలు కొట్టుకుపోవడంలో వింత ఏమి లేదని చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లో మాత్రం ఒక స్కూటీ కింద పడకుండా ఏదో ఆత్మ స్కూటీ నడుపుతున్నట్లు వెనక్కి వెళ్లడం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ముంబైలో అధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే వరద నీటి ప్రవాహం ఇండ్లలోకి షాపుల లోకి రావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో చించ్‌పోక్లీ ఏరియాలో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలని నీటిలో కొట్టుకు పోయాయి.
స్థానికులు చూస్తుండగానే స్కూటీ వరదనీటిలో కింద పడకుండా స్కూటీ అలా వెనక్కి వెళుతూ ఉండటం చూసిన స్థానికులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అందరూ.. బండిపై మనిషి లేకుండా స్కూటీ అలా కదులుతూ వెనక్కి వెళ్లడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్లు చేయగా.. మరి కొందరు ఏదైనా ఆత్మ బండి నడుపుతూ ఉందా..అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అచ్చం సినిమా గ్రాఫిక్స్ ను తలపిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.































