General News

ప్రెగ్నన్సీ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది ? ఎందుకు వద్దంటారో తెలుసా?

గర్భిణీగా వున్న సమయంలో ఆడవారికి అనేక నియమాలు ఉంటాయి. పెద్దవాళ్ళు గర్భిణీ ఆరోగ్యం కోసం మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలను పాటించాలని చెబుతుంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు వారి పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలను సైతం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అందులో భాగమే సీమంతం వేడుక. ఇప్పటికీ చాలా మంది ఇటువంటి పురాతన పద్ధతులను పాటిస్తూన్నారు. మనం పూర్వం నుండి వింటున్నది ప్రెగ్నన్సీ సమయంలో ఆడవారి చేతులకి గోరింటాకు పెట్టుకోవద్దని, ఈ విషయాన్ని చాలా మంది ఇళ్లలో పెద్దలు కూడా చెబుతూ వుంటారు.

ప్రతి ఆడవారికి సహజంగానే గోరింటాకు పెట్టుకోవడం అంటే ఏంతో ఇష్టం. నిజానికి మన యొక్క హిందూమతంలో వున్న 16 అలంకారాలలో గోరింటాకు అనేది ఆడవారికి ఒక అలంకారం. చేతికి గోరింటాకు పెట్టుకోవడం అనేది పెళ్లికి మాత్రమే కాకుండా ప్రతి శుభకార్యాలకు మరియు పండగలకు కూడా ఆడవారు గోరింటాకు శుభప్రదంగా భావించి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ గర్బిణిగా వున్న సమయంలో మాత్రం గోరింటాకును పెట్టుకోవడం వల్ల హాని కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి గోరింటాకు ఆనందాన్ని మరియు ప్రేమను సూచిస్తుంది కానీ ఇది శుక్ర గ్రహానికి సంబంధించింది అని మరియు గర్భిణీ లు గోరింటాకు పెట్టుకోవడం వలన శుక్ర గ్రహం యొక్క శక్తి తీవ్రతరం అవుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది గ్రహాలపైనా ప్రభావం చూపుతుంది అందువల్ల గర్బిణిగా వున్న సమయంలో గోరింటాకు పెట్టుకోకపోవడమే మేలు. ఎప్పుడైతే గర్భిణీ స్త్రీ యొక్క జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో అటువంటి సమయంలో గర్భిణీ గోరింటాకు పెట్టుకోకూడదు. అందుకే గోరింటాకు పెట్టుకుంటే శుక్రుడు బలహీనం వలన సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అదే కాకూండా స్త్రీ యొక్క జాతకంలో శని, రాహు లేదా కేతు గ్రహాలు కూడా బలంగా ఉన్నప్పుడు గోరింటాకును పెట్టుకోవడం వలన మరింత ముప్పు ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల ప్రభావం వలన ఆందోళన, ఒత్తిడి వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. అందుకే పండితులు గర్భిణీగా వున్నపుడు గోరింటాకు పెట్టుకోకూడదు అని చెపుతువుంటారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago