Movie News

నయనతార తో శేఖర్ కమ్ముల గొడవకు కారణం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది…!

Sekhar Kammula Vs Nayanthara

దర్శకుడు శేఖర్ ఖమ్ముల పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా “ఆనంద్”. ఓ మంచి కాఫీ తాగిన తరువాత కలిగే తీపి అనుభూతిలా ఉండే ఈ సినిమాతోనే శేఖర్ ఖమ్ముల తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయన సినిమాల్లో అతి నిశబ్దంగా గుండెను తాకే భావోద్వేగాలు, నిజాయితీతో నిండి ఉండే పాత్రలు, చక్కటి సంభాషణలు కనిపిస్తాయి. గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలు ఆయన ప్రత్యేకతను మరింతగా చాటాయి. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా, గాఢమైన భావోద్వేగాలను ముందుకు తేవడంలో శేఖర్ ఖమ్ముల తనకంటూ ఒక స్పష్టమైన ముద్ర వేసుకున్నారు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న ఆయనకు నంది అవార్డులు, సైమా వంటి పురస్కారాలు కూడా లభించాయి. తాజాగా ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో రూపొందిన “కుబేర” సినిమా హిట్ టాక్‌తో కొనసాగుతోంది.

అయితే, శేఖర్ ఖమ్ముల కెరీర్‌లో ఒక అనుకోని మలుపు తీసుకున్న సంఘటన మాత్రం నయనతారతో తీసిన సినిమా “అనామిక” తో జరిగింది. ఇది బాలీవుడ్‌లో విద్యాబాలన్ నటించిన “కహానీ” సినిమా రీమేక్. ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటించగా, సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణంగా నయనతార ప్రమోషన్లలో పాల్గొనకపోవడమేనని అప్పట్లో చర్చ జరిగింది. దర్శకుడిగా శేఖర్ ఖమ్ముల, సినిమా విజయాన్ని సాధించడంలో భాగంగా నటీనటులు ప్రమోషన్లలో భాగస్వామ్యం కావాలని నమ్ముతారు. కానీ నయనతార సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని పూర్తిగా దూరంగా ఉంచడం ఆయనకు నచ్చలేదు.

ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. షూటింగ్ సమయంలో కూడా నయనతార తీరుపై శేఖర్ అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.. ఆమె వ్యవహార శైలితో విసిగిపోయిన శేఖర్ కమ్ముల, సినిమా విడుదల తరువాత “నయనతారతో ఇకపై పని చేయను” అని స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా, రీమేక్ సినిమాలు కూడా ఇకపై చేయనని కూడా తేల్చి చెప్పారు. ఈ మాటల వెనుక ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు కారణం అనడం తప్పు కాదు.

శేఖర్ ఖమ్ముల మొదటి చిత్రం “డాలర్ డ్రీమ్స్” గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అమెరికాలో ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలి, సినిమా మీద ఉన్న ప్రేమతో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసి ఇండియాకు తిరిగొచ్చి తాను తీసిన ఈ సినిమాకు కూడా నేషనల్ అవార్డు లభించింది. ఆ సమయంలో నిర్మాతలు ముందుకు రాకపోవడంతో తన అక్క, అన్నల ఆర్థిక సహాయంతో కేవలం 18 లక్షలతో సినిమాను తీశారు. డిస్ట్రిబ్యూషన్ అనుభవం లేక చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఆ సినిమా ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది.

అందుకే శేఖర్ ఖమ్ముల ఒక మృదుస్వభావి. తన కెరీర్‌లో వచ్చిన ప్రతీ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగిన ఆయన, ఇప్పుడు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ మధ్య ఒక బ్రాండ్‌గా మారారు. నయనతారతో జరిగిన సంఘటన కూడా ఆయన దృఢ నిర్ణయాలను ప్రతిబింబిస్తుంది. ఒక్కసారి నమ్మిన విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా శేఖర్ ఖమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago